Prabhas's Fauji Movie Release Date: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూస్. ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్‌లో 'ది రాజాసాబ్'తో పాటు హను రాఘవపూడి దర్శకత్వం 'ఫౌజీ' మూవీస్ చేస్తున్నారు. 'ది రాజాసాబ్' వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా... 'ఫౌజీ' సైతం రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

'ఫౌజీ' మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' ప్రమోషన్లలో భాగంగా నిర్మాతలు నవీన్, రవి మూవీ రిలీజ్‌ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీని సైతం వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో వచ్చే ఏడాది మూవీ లవర్స్‌కు పండుగే అని చెప్పాలి.

Continues below advertisement

Also Read: బాలీవుడ్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ రూమర్స్! - ఆ డ్రెస్‌లో చూసి కన్ఫర్మ్స్ చేసేస్తోన్న నెటిజన్లు

'సీతా రామం' వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న మూవీపై భారీ హైప్ నెలకొంది. 1940ల నాటి బ్యాక్ డ్రాప్‌తో స్టోరీ సాగనుండగా... మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... 50 శాతానికి పైగా షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పీరియాడికల్ వార్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా... ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక  పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

గతంలో 'ఫౌజీ'లో ప్రభాస్ లుక్స్ అంటూ కొన్ని ఫోటోలు వైరల్ కాగా... వాటిపై మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభాస్‌ను ఆర్మీ లుక్‌‌లో మార్ఫింగ్ చేస్తూ కొందరు ఏఐ ఫోటోలు వైరల్ చేశారు. ఇది సెట్స్ నుంచి వచ్చిన ఫోటో అంటూ ప్రచారం చేశారు. దీనిపై రియాక్ట్ అయిన మూవీ టీం... సెట్స్ నుంచి లీక్ అయ్యాయంటూ వచ్చిన ఫోటోస్ ఎవరూ షేర్ చెయ్యొద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే వారి అకౌంట్స్ రిమూవ్ చేయడమే కాకుండా అది సైబర్ నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది.