రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్... స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఆమె ఖాతాలో పాన్ ఇండియా హిట్స్ ఉన్నాయి. పెద్ద సినిమాలు ఉన్నాయి. చారిత్రక కథతో తెరకెక్కిన విక్కీ కౌశల్ 'ఛావా'లో రియల్ లైఫ్ బేస్డ్ రోల్ చేశారు. ఇప్పుడు మరొక రోల్ చేయబోతున్నారు. ఆమె ఓ బయోపిక్ ఓకే చేశారు. రుక్మిణీ వసంత్, సాయి పల్లవిని కాదని ఆ ఛాన్స్ రష్మిక దగ్గరకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక... లుక్ టెస్ట్ కూడా!MS Subbulakshmi Biopic Update: భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయని (కర్ణాటిక్ సింగర్), భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో రష్మిక మందన్న టైటిల్ రోల్ చేయనున్నారు. సుబ్బలక్ష్మి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
Also Read: Jailer 2 Latest Update - ఫస్ట్ బాలకృష్ణ... ఇప్పుడు షారుఖ్ కూడా? - 'జైలర్ 2' లేటెస్ట్ అప్డేట్
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ఆవిడ పాత్రను నేషనల్ క్రష్ రష్మిక మందన్న పోషించనున్నారు. ఇంతకు ముందు ఆ పాత్ర కోసం సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ... చివరకు రష్మిక మందన్నను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇటీవల రష్మిక మందన్న ఇంటిలో లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను రష్మిక ట్రై చేశారట. ఆ లుక్‌లో రష్మిక నచ్చడంతో ఆమెను ఫైనలైజ్ చేశారట.
Also Read: NTR Dragon Latest Update - శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు
'జెర్సీ'తో విజయం అందుకోవడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. 'జెర్సీ'తో పాటు 'కింగ్‌డమ్'కు సంగీతం అందించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు మ్యూజిక్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read: Janhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు
