'సీతా రామం'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన మరాఠీ అమ్మాయి మృణాల్ ఠాకూర్. తొలుత హిందీలో సీరియల్స్ చేశారామె. అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి... ఇప్పుడు తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ స్టార్‌గా ఎదిగారు. అయితే మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన సింప్లిసిటీ, బలమైన నటనతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్... ఈ రోజు పరిశ్రమలో ప్రతిభావంతులైన హీరోయిన్లలో ఒకరు అని చెప్పవచ్చు. అయితే, ఆమె ఈ స్థాయికి సులభంగా రాలేదు. ఆమెకు విజయాలు అంత ఈజీగా దక్కలేదు. ఇటీవల ఏబీపీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో బడా సినిమాల్లో భాగం కాబోతున్న సమయంలో ఎదురైన తిరస్కరణల గురించి మృణాల్ ఠాకూర్ మనసు విప్పి మాట్లాడారు.

బాలీవుడ్‌లో రిజెక్షన్స్ గురించి ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్ఇటీవల ABP న్యూస్‌తో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ... తాను చాలా తిరస్కరణలను ఎదుర్కొన్నానని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... "నేను చాలా తిరస్కరణలను ఎదుర్కొన్నాను. నేను చాలా పెద్ద సినిమాలలో భాగం కావాల్సి ఉంది. కానీ, అది జరగలేదు, ఎందుకంటే... బహుశా ఆ సమయంలో నేను సిద్ధంగా లేకపోవచ్చు. కానీ ఈ రోజు నేను చాలా నమ్మకంగా ఉన్నాను" అని అన్నారు.

Also Read: Shilpa Shirodkar: మహేష్ బాబు మామగారి జయంతి... ఎమోషనల్ అయిన వదిన శిల్పా శిరోద్కర్  

జీవితంలో అప్‌ అండ్ డౌన్స్‌ అవసరం!హిందీ గురించి మృణాల్ మాట్లాడుతూ... "నా హిందీ స్పష్టంగా లేదన్నారు. ఎందుకంటే... నేను మహారాష్ట్ర కుటుంబం నుండి వచ్చాను" అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... ''నేను ప్రేమ్ చంద్ కథలు చదివా. హిందీ షోలు చూశా. వార్తాపత్రికలు చదివా. నేను మలయాళ, తమిళ, తెలుగు సినిమాలను చూడటం ప్రారంభించా. ఆరేళ్ల క్రితం సినిమాలు చూసిన నేను... ఈ రోజు ఇక్కడ ఉంటానని ఎవరు అనుకున్నారు? ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో అప్ అండ్ డౌన్స్‌ అవసరం అనిపిస్తుంది'' అని అన్నారు. 

Also ReadKalpana Iyer Viral Video: 69 ఏళ్ల వయసులో 'రంభా హో' పాటకు డ్యాన్స్‌... కల్పనా అయ్యర్ వైరల్ వీడియో

టీవీ షోలు 'ముఝ్‌సే కుచ్ కహతీ... యే ఖామోషియాన్', 'కుమ్‌ కుమ్ భాగ్య'తో మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రారంభించారు. వాటి ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది. 'లవ్ సోనియా'తో ఆమె 2018లో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 'సూపర్ 30', 'బట్లా హౌస్' వంటి హిట్ సినిమాల్లో నటించారు. 'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి విజయవంతమైన తెలుగు సినిమాలతో ఆమె మరింత ప్రజాదరణ పొందారు. 

Also ReadGovinda: బాలీవుడ్ స్టార్ గోవిందా పతనం మొదలైందా? అంత చిన్న కారులో ప్రయాణించడం వెనుక కారణం ఏమిటంటే?