Firing Outside Bollywood Director Rohit Shetty's Mumbai Home : బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున ముంబయి నగరంలోని జుహు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి బైక్‌పై పారిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, కాల్పులు జరిగిన టైంలో రోహిత్ శెట్టి ఇంటి వద్దే ఉన్నారా? లేదా ? అనే దానిపై క్లారిటీ లేదు. నిందితుని కోసం గాలిస్తున్న పోలీసులు రోహిత్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. రోహిత్ ఫ్యామిలీ ఈ ఘటనపై ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు.

Also Read : కవలలకు జన్మనిచ్చిన ఉపాసన - వారసుడి రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు షురూ

సినిమాల విషయానికొస్తే... రోహిత్ శెట్టి... గోల్ మాల్, సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్, జమీన్, సింగ్ రిటర్న్స్, సర్కస్, సూర్యవంశీ వంటి మూవీస్ తెరకెక్కించారు. లాస్ట్‌గా ఆయన తీసిన సింగం అగైన్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రోహిత్ 'గోల్ మాల్' ఫ్రాంచైజీలో ఐదో మూవీ తీస్తున్నారు.