Mrunal Thakur On Losing Films: మృణాల్ ఠాకూర్.. వ‌రుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ మ‌రాఠి యాక్ట‌ర్. తెలుగులో 'సీతారామం', 'హాయ్ నాన్న‌', 'ఫ్యామిలీ స్టార్' సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా కుర్ర‌కారు మ‌న‌సు దోచేసింది. ప‌ద‌హార‌నాళ్ల తెలుగమ్మాయిలా త‌న క‌ట్టు బొట్టుతో ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అయితే, ఈ అందాల న‌టి ఇప్ప‌టికే చాలా సినిమాలు మిస్ చేసుకుంద‌ట‌. కార‌ణం త‌న పేరెంట్స్ ఒప్పుకోక‌పోవ‌డం అని చెప్తోంది. ముద్దు సీన్లు ఉంటే ఇబ్బంది అని, అలాంటి సీన్లు ఉన్న సినిమాలు చేయొద్ద‌ని అంటార‌ని చెప్పింది. ఈ మ‌ధ్య ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ విష‌యాలు చెప్పుకొచ్చింది. 


ఆ సీన్లు కంఫ‌ర్ట్ గా చేయ‌లేను.. 


“రొమాంటిక్ సీన్లు, ఇంటిమేట్ సీన్లు చేయాలంటే అస్స‌లు కంఫ‌ర్ట్ గా ఉండ‌ను. నాకు చాలా భ‌యం. అందుకే అలాంటి సీన్లు ఉంటే సినిమాకి నో చెప్పేస్తాను. మా పేరెంట్స్ అలాంటి సినిమాల‌కి అస్స‌లు ఒప్పుకోరు. ఎన్ని రోజుల‌ని నో చెప్తూ ఉండాలి. అందుకే, కూర్చొని నా పేరెంట్స్ ని క‌న్విన్స్ చేస్తాను. నాన్న.. అలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు నేను చేయాలి, త‌ప్పదు అని న‌చ్చ‌చెప్తాను. ఇక ఒక్కోసారి నాకు ఆ సినిమా చేయాల‌ని అనిపించినా.. ముద్దు సీన్లు ఉంటే నేను డ్రాప్ అవ్వాల్సిందే. ఒక యాక్ట‌ర్ గా నేను అన్నింటికీ రెడీగా ఉండాలి. ఎందుకంటే సీన్ డిమాండ్ చేస్తుంది కాబ‌ట్టి. ఒక‌వేళ అలా కంఫ‌ర్ట్ కాక‌పోతే కూర్చుని మాట్లాడుకోవాలి. కాని నేను ఏకంగా సినిమానే వ‌దిలేస్తాను" అని చెప్పింది మృణాల్ ఠాకూర్. 


అర్థం చేసుకునే పార్టనర్‌ను వెతుక్కోవాలి.. 


"కెరీర్‌ను, లైఫ్‌ను క‌చ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. రిలేష‌న్ షిప్స్ అనేవి చాలా ట‌ఫ్. నాకు బాగా తెలుసు. అందుకే, మ‌న కెరీర్‌ను, మ‌నల్ని అర్థం చేసుకుని స‌పోర్ట్ చేసే పార్ట‌న‌ర్ దొరికితేనే ఆనందంగా ఉంటాం. అలాంటి వాళ్ల‌నే వెతుక్కోవాలి" అని అన్నారు మృణాల్. ఇక ఈ మ‌ధ్యే ఆమె ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో.. మీ అండాన్ని ఫ్రీజ్ చేసుకుంటారా? అని అడిగితే దాని గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పారు మృణాల్. 


వ‌రుస సినిమాలు.. 


మృణాల్ ఠాకూర్ పేరుకి మ‌రాఠి హీరోయిన్ అయినా.. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 'సీతారామం' సినిమాలో సీత క్యారెక్ట‌ర్ లో ఒదిగిపోయింది మృణాల్. ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది ఆమె యాక్టింగ్ తో. ఆ త‌ర్వాత 'హాయ్ నాన్న' లో కూడా అద్భుతంగా న‌టించింది. ఇటీవ‌ల ఆమె న‌టించిన 'ఫ్యామిలీ స్టార్' అనుకున్నంత రీతిలో ఆడ‌లేదు. ప్ర‌స్తుతం ఆ సినిమా ఓటీటీలో ఉంది. మృణాల్.. ప్ర‌స్తుతం హిందీ సినిమా 'పూజా మేరీ జాన్' లో న‌టిస్తున్నారు. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ నెక్ట్స్ సినిమాలో మృణాల్‌ ఫిమేల్‌ లీడ్‌ చేయబోతున్నట్టు టాక్‌. ఇక ఇదిలా ఉంటే మృణాల్ గ‌తంలో కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేశారు. త‌న‌కు హిందీలో పెద్ద‌గా ఛాన్స్ ఇవ్వ‌ర‌ని, ఆమెను ఇంకా గుర్తించ‌లేదు అంటూ కామెంట్ చేశారు.  


Also Read: వైర‌ల్ అవుతున్న మ‌హేశ్ బాబు వీడియో.. రాజ‌మౌళి సినిమా లుక్ అదేనా?