బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి రోజూ ఎన్నో గాసిప్‌లు వస్తూ ఉంటాయి. రిలేషన్‌షిప్ లేదా బ్రేకప్ గురించి... మరో అడుగు ముందుకు వేసి పెళ్లి గురించి కథనాలు రావడం సహజం. అయితే కోలీవుడ్ స్టార్ ధనుష్ - సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ అతి త్వరలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్‌లో కథనాలు రావడంతో తెలుగులోనూ డిస్కషన్ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మృణాల్, ధనుష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వెడ్డింగ్ న్యూస్ మధ్య మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లోనూ సోషల్ మీడియా నెటిజనులు ధనుష్ కనెక్షన్ బయటకు తీశారు.
సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పెళ్లి వార్తలు వచ్చినప్పటి నుండి ఆమె ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది మృణాల్ ఠాకూర్. ఆ వీడియో ఒక ట్రిప్ గురించినది. అందులో సముద్రం మధ్య ఎంజాయ్ చేస్తోందీ అందాల భామ. ''గ్రౌండెడ్, గ్లోయింగ్ మరియు అడిగ్'' అని మృణాల్ క్యాప్షన్‌లో రాసింది.
మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇక్కడ చూడండి:
మృణాల్ పోస్ట్‌లో ధనుష్ కనెక్షన్
మృణాల్ ఠాకూర్ పోస్ట్ చేసిన వీడియో గమనిస్తే... సోషల్ మీడియాలో చాలా మంది లైక్ చేస్తున్నారు. అలాగే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే... కొంత మంది ఆ వీడియోలో ధనుష్ కనెక్షన్ ఉందంటున్నారు. మృణాల్ వీడియోలో తమిళ పాట ఉందని, ధనుష్ తమిళుడు కాబట్టి అందుకే ఆ పాటను పెట్టిందని పలువురు నెటిజనులు భావిస్తున్నారు.
Also Read: Tamannaah Bhatia: యూట్యూబ్‌లో తమన్నా ఐటమ్ నంబర్ రికార్డులు... దుమ్ము రేపిన 'ఆజ్ కీ రాత్'
ధనుష్ - మృణాళ్ పెళ్లి ఎప్పుడు?
మృణాల్ ఠాకూర్, ధనుష్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వాటి ప్రకారం... ఫిబ్రవరి 14న వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహిత బంధువులు మాత్రమే పాల్గొంటారట. ధనుష్ 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన 20 సంవత్సరాలకు 2024లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మరి మృణాల్, ధనుష్ తమపై వస్తున్న వార్తలకు ఎప్పుడు బదులు ఇస్తారో చూడాలి.
Also Read: టబుతో రిలేషన్షిప్... ఆమెతో వన్ నైట్ స్టాండ్... హీరోయిన్‌ను వదిలేసి ఆవిడతో పెళ్లి?