Mr Bachchan Producer TG Vishwaprasad Sensational Comments: మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు బోల్తా కొట్టింది. విడుదలకు ముందు టీం మూవీపై హైప్ క్రియేట్ చేసింది. వరుస ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్రంపై బజ్ క్రియేట్ చేసింది. చివరకు మూవీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా ఫ్యాన్స్‌ని 'మిస్టర్ బచ్చన్' దారుణంగా నిరాశ పరిచింది.
అసలు మూవీలో కంటెంట్ ఏం లేదని, పది నిమిషాల కంటెంట్ సినిమా 2:30 గంటలు నడిపించారంటూ హరీష్ శంకర్‌పై మండిపడ్డారు. ఈ సినిమా తీసి మాస్ మాహారాజ టైం వేస్ట్ చేశారంటూ డైరెకర్‌ని ఏకిపారేశారు. మొత్తానికి మిస్టర్ బచ్చన్ రవితేజ కెరీర్‌లోనే చెత్త సినిమాగా నిలిచింది. తాజాగా మూవీ డిజాస్టర్‌పై మూవీ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ అధినే టీజీ విశ్వప్రసాద్ స్పందించారట. ఈ సినిమా హరీష్ శంకర్ వల్లే మూవీ ప్లాప్ అయ్యిందని ఆయన సంచలన కామెంట్స్ చేశారట. మూవీపై ప్లాప్ తన అభిప్రాయాన్ని చెబుతూ.. "నిజానికి మిస్టర్ బచ్చన్ మూవీ అంత బ్యాడ్ సినిమా ఏం కాదు. ఫస్టాఫ్ బాగుంది.
పాటలు కూడా బాగున్నాయి. కానీ సెకాండ్ ఫూర్తిగా గాడీ తప్పింది. అసలు కంటెంట్ లేకుండా సాగింది.దానికి తోడు హరీష్ శంకర్ ఇచ్చిన ఇంటర్య్వూలు మూవీ మరింత మైనస్ అయ్యాయి. సినిమాకు ఇవ్వాల్సిందానికి కంటే ఎక్కువ హైప్ ఇచి ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచారు. రిలీజ్‌కు ముందు డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్య్వూలు, ప్రెస్ మీట్‌లు సినిమా ప్లాప్‌కు ప్రధాన కారణాలు. 'మిస్టర్ బచ్చన్' విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో హరీష్ కావల్సిన దానికంటే కాస్త ఎక్కువ మాట్లాడారు. ఓ గాసిప్ వెబ్ సైట్‌కి పనిగట్టుకుని మరి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది సినిమాకు బాగా డ్యామేజ్ అయ్యింది. ఫ్లాప్ టాక్ వచ్చిన తరువాత కూడా ఆయన ఫ్యాన్స్‌తో డిబెట్‌లు పెట్టి వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ పోయారు.
అది ప్లస్ అవ్వకపోగా, మైనస్ అయ్యింది. ఇలా హరీష్ శంకర్ చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్ కంటే కూడా నష్టమే ఎక్కువ చేశాయి. అసలు ఓ సినిమా హిట్టు, ప్లాప్స్ అనేది ప్రధానం కాదు. అవి కామన్. కానీ మూవీకి కీలక సమయంలో మనం ఏం మాట్లాడుతున్నాం, మన యాటిట్యూడ్ చాలా ముఖ్యం. రిలీజ్‌కు ముందు సినిమాని ఏ స్థాయిలో మోస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రేక్షకులు గమనిస్తుంటారు. హరీష్ శంకర్ అనవసరమైన ఇంటర్య్వూలు, ప్రెస్‌మీట్ సినిమాకు కావల్సిన దానికంటే ఎక్కువ డ్యామేజ్‌ని తెచ్చిపెట్టాయంటూ ఆయన వాపోయినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. అంతేకాదు మనమే సినిమా ప్లాప్‌పై కూడా ఆయన స్పందించారట.
ఇదే సంస్థ నుంచి వచ్చిన 'మనమే' సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా వల్ల లాభపడేవాళ్లమేనని, కానీ ఓ చీటర్ వల్ల నష్టపోయినట్టు చెప్పారు టీజీ విశ్వప్రసాద్. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో మోసపోయామని, థర్డ్ పార్టీ చేతుల్లో మనమే హక్కులు ఉండిపోయాయన్నారు. దానివల్ల మూవీని తాము అమ్ముకోలేక, థర్ట్ పార్టీ కూడా అమ్మక పోవడంతో మొత్తం బడ్జెట్‌లో 60 శాతం డబ్బులు అక్కడే ఇరుక్కుపోయామని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయమై న్యాయపోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. అయిటే టీజీ విశ్వప్రసాద్ 'మిస్టర్ బచ్చన్'ప్లాప్ భారాన్ని హరీష్ శంకర్‌పై మోయడంతో ఇప్పుడది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
Also Read: నిజంగా షాకయ్యా.. హేమ కమిటీ రిపోర్టుపై నాని కీలక వ్యాఖ్యలు