RRR Trailer LIVE: ఆర్ఆర్‌ఆర్ టీం మరో బిగ్ సర్‌ప్రైజ్
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ట్రైలర్ మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABP Desam Last Updated: 09 Dec 2021 10:44 AM
Background
సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ కాసేపట్లో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్లు, పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసిన జక్కన్న రాజమౌళి... ట్రైలర్‌లో ఏం చూపించబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మూడు గంటల సినిమాను మూడు నిమిషాల్లో సూటిగా...More
సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ కాసేపట్లో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్లు, పోస్టర్లతో సినిమాపై అంచనాలు పెంచేసిన జక్కన్న రాజమౌళి... ట్రైలర్‌లో ఏం చూపించబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మూడు గంటల సినిమాను మూడు నిమిషాల్లో సూటిగా చెప్పేయాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ట్రైలర్‌లో అసలు కథేంటి? అనేది చూపించబోతున్నారు. మరికొన్ని గంటల్లో... గురువారం ఉదయం విడుదల కానున్న ట్రైలర్‌లో రాజమౌళి కథను రివీల్ చేయబోతున్నారని టాక్. ప్రేక్షకుల అంచనాలు మించి ట్రైలర్ ఉంటుందని తెలిసింది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా కథ చెప్పేస్తే... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? కొందరిలో ఈ సందేహం రావచ్చు. కథేంటో చెప్పి మరీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం రాజమౌళి స్టయిల్. 'బాహుబలి 2' విడుదలకు ముందు వరకూ 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నకు సమాధానం ఆయన దాచిపెట్టారు కానీ... అంతకు ముందుకు వెళితే, సినిమా విడుదలకు ముందే కథేంటో చెప్పేసేవారు. 'మర్యాద రామన్న', 'ఈగ' సినిమాలకు అదే విధంగా చేశారు. స్టోరీ రివీల్ చేసి, 'ఈ స్టోరీని రాజమౌళి ఎలా తీసి ఉంటాడు?' అని ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఆయన స్టయిల్. ఈసారీ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?'ఆర్ఆర్ఆర్'లో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే... ఇది కొమరం భీమ్, అల్లూరి కథ కాదు. వాళ్లిద్దరి పాత్రలను ఆధారం చేసుకుని, ఫిక్షనల్ స్టోరీతో 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కిస్తున్నామని రాజమౌళి ముందే చెప్పారు. ఇప్పుడు ట్రైలర్‌లో ఆ ఫిక్షనల్ స్టోరీ చెప్పబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? బ్రిటీషర్లపై ఎలా పోరాడారు? అజయ్ దేవగణ్ పాత్ర ఏమిటి? వంటి అంశాలపై ట్రైలర్‌లో క్లారిటీ ఇవ్వనున్నారని తెలిసింది.Also Read: 'జనని...' పాటకు జీవం పోసిన పాత్రలు ఇవే!ఆలియా భట్, ఒలీవియా మోరిస్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా... డీవీవీ దానయ్య నిర్మించారు. జనవరి 7న సినిమా విడుదల కానుంది.Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
RRR Trailer : రాజమౌళి చెక్కిన అల్లూరిని చూశారా?
ట్రైలర్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి కనిపించే సీన్స్ హైలెట్‌గా నిలిచింది. మొదట్లో ఎన్టీఆర్ పులితో తలపడే సీన్ ఒక హైలెట్ అనుకుంటే చివర్లో అల్లూరిగా రామ్‌చరణ్ కనిపించి సర్‌ప్రైజ్ చేశారు...