Mohanlal's Vrusshabha Teaser Out: మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ 'వృషభ'. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
యాక్షన్ వేరే లెవల్
నంద కిశోర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతుండగా మోహన్ లాల్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎలాంటి డైలాగ్స్ లేకుండానే కేవలం విజువల్స్, యాక్షన్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు. ఓ రాజ భవనంలో తల్లి పురిటి నొప్పులు పడుతూ ఓ బిడ్డకు జన్మనివ్వడం బ్యాక్ డ్రాప్‌లో చూపిస్తూనే కత్తి దూసి యుద్ధం చేస్తున్న రాజుగా ఓ యోధుడిగా మోహన్ లాల్‌ను చూపించారు. మైథలాజికల్ ఫాంటసీ డ్రామాలో యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. చివరిగా కొడుకు ఒడిలో తండ్రి పడుకుని సేద తీరుతున్నట్లుగా చూపించడం... తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు ప్లాష్ బ్యాక్‌లో ఆయన కథ ఏంటి అనేది సస్పెన్స్‌గా మారింది.
దీపావళి సందర్భంగా
ఈ మూవీని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శోభా కపూర్, సీకే పద్మా కుమార్, ఏక్తా కపూర్, సౌరభ్ మిశ్రా, వరుణ్ మాథుర్, విశాల్ గుర్నాని, అభిషేక్ వ్యాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న పాన్ ఇండియా లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.