Mohanlal's Vrusshabha Release Date Announced: కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అవెయిటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'వృషభ'. మలయాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీకి నందకిశోర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే, దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న మూవీ రిలీజ్ అవుతుందని ముందు ప్రకటించినా అనుకోని కారణాలతో వాయిదా పడింది.
రిలీజ్ ఎప్పుడంటే?
పాన్ ఇండియా లెవల్‌లో నవంబర్ 6న మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... టీజర్‌తో ఆ హైప్ పదింతలు అయ్యింది. మోహన్ లాల్‌తో పాటు సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన సారిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు.
మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. మూవీని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె.పద్మకుమార్, వరుణ్ మాథూర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నానీ, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'మిరాయ్' - 4 భాషల్లోనే స్ట్రీమింగ్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ మూవీలో యోధుడైన ఓ రాజుగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు మోహన్ లాల్. ఇందులో గతంలో ఆయన్ను రాజు పాత్రలో చూపించగా భారీ యాక్షన్ సీక్వెన్స్ టీజర్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తండ్రీ కొడుకుల అనుబంధం, ఎమోషన్ అన్నీ చూపించారు.
అద్భుతమైన విజువల్స్
'వృషభ' సినిమాతో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నట్లు చెప్పారు డైరెక్టర్ నందకిశోర్. 'నవంబర్ 6న మూవీ రిలీజ్ చేస్తున్నామని తెలియజేసేందుకు చాలా ఆనందంగా ఉంది. మూవీలో బలమైన ఎమోషన్స్‌తో పాటు అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. బంధాలు, త్యాగాలు కలయికగా రూపొందిన ఈ మూవీ ఆడియన్స్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇది ఒక స్పెషల్, సంక్లిష్టమైన కథ. దీనికి సిల్వర్ స్క్రీన్‌పై ప్రాణం పోయడానికి ఎంటైర్ టీం ఎంతో కష్టపడ్డారు. మూవీ చూసిన ఆడియన్స్‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు.' అని చెప్పారు.
హృదయానికి దగ్గరైన కథ
'వృషభ' తన హృదయానికి దగ్గరైన కథ అని నిర్మాత ఏక్తా కపూర్ తెలిపారు. 'ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో 'వృషభ'ను నిర్మించాం. బలమైన ఎమోషన్స్, లార్జర్ దేన్ లైఫ్ డ్రామాతో ఇండియన్ సినిమాను గొప్పగా ఆవిష్కరిస్తున్నాం. వరల్డ్ వైడ్‌గా ఆడియన్స్‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు రెడీగా ఉన్నాం.' అని అన్నారు.