విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాలు గుర్తు ఉన్నాయా? మన తెలుగు ప్రేక్షకులకు మంచి క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమాలకు రీమేక్స్ అవి. ఆ సినిమాల ప్రస్తావన ఎందుకు అంటే... ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మరో సీక్వెల్ అనౌన్స్ చేశారు మోహన్ లాల్.
సెట్స్ మీదకు 'దృశ్యం 3'...అక్టోబర్‌లో సినిమా విడుదల!'గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు' అంటూ సోషల్ మీడియాలో మోహన్ లాల్ ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో జార్జ్ కుట్టి పాత్రలో ఆయన కనిపించారు. ''కెమెరా మరోసారి జార్జ్ కుట్టి వైపు తిరిగింది'' అని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు... అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
జార్జ్ కుట్టి పాత్రలో కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి సిద్ధపడే తండ్రి పాత్రలో మోహన్ లాల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేరళలో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అంతే కాదు... తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేశారు. వాళ్ళూ విజయాలు అందుకున్నారు.
Also Read: బ్లాక్ బస్టర్ 'కుబేర': రష్మిక అకౌంట్‌లో మరో హిట్, కానీ అభిమానులకు నిరాశ... కారణం ఏంటంటే?
హిందీలో కూడా 'దృశ్యం 3'...అక్టోబర్‌లోనే ఆ సినిమా విడుదల!అజయ్ దేవగణ్ సైతం హిందీలో 'దృశ్యం 3' చేస్తున్నారు. అయితే... ఆ సినిమా రీమేకా? కాదా? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మూడో 'దృశ్యం' కంటే ముందు రెండు దృశ్యాలను ఆయన మలయాళం నుంచే తీసుకున్నారు. మలయాళంలో అనౌన్స్ చేయడానికి ముందు హిందీలో మూడో 'దృశ్యం' మొదలైంది.
Also Read: మెగా హీరోలకు బ్లాక్ బస్టర్ నెల... హరిహర వీరమల్లుకు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'దృశ్యం 3' విడుదల చేయడానికి అజయ్ దేవగణ్ సన్నాహాలు చేస్తున్నారు. మరి మోహన్ లాల్ 'దృశ్యం 3' కూడా అదే రోజున విడుదల అవుతుందా? లేదంటే రెండు మూడు వారాల తర్వాత విడుదల చేస్తారా? అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే రెండు సినిమాలు ఒకే సమయంలో సెట్స్ మీదకు వెళ్లడం విశేషం.