మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సూపర్ హిట్ సినిమాలలో 'మిరపకాయ్' (Mirapakay) ఒకటి. రవితేజలో ఎనర్జీని ఫుల్లుగా వాడుకోవడంతో పాటు ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు దర్శకుడు హరీష్ శంకర్‌. ఈ సినిమాను వచ్చే నెలలో రీ రిలీజ్ చేస్తున్నారు.

Continues below advertisement


జూలై 11న థియేటర్లలోకి మళ్లీ మిరపకాయ్!
జూలై రెండవ వారంలో... 11వ తేదీన 'మిరపకాయ్' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. రవితేజ సినిమాలు రీ రిలీజ్ కావడం అరుదు. ఇంతకు ముందు 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' రీ రిలీజ్ అయ్యింది. అయితే అది క్లాస్ సినిమా. మాస్ మహారాజా ఎనర్జీని స్క్రీన్ మీద చూపించిన సినిమాలో రిలీజ్ అయితే బాగుంటుందని అభిమానులు ఆశించారు. వాళ్లకు 'మిరపకాయ్' మంచి విందు భోజనం అని చెప్పాలి. హనుమాన్ మీడియా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తోంది.


Also Read: బ్లాక్ బస్టర్ 'కుబేర': రష్మిక అకౌంట్‌లో మరో హిట్, కానీ అభిమానులకు నిరాశ... కారణం ఏంటంటే?


మొదటి సినిమా ఫ్లాప్ అయినా మళ్లీ ఛాన్స్!
హరీష్ శంకర్ (Harish Shankar)ను దర్శకుడుగా పరిచయం చేసింది రవితేజే. 'షాక్' సినిమాతో అతడికి తొలి అవకాశం ఇచ్చారు. అయితే అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో వీవీ వినాయక్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులు దగ్గర కొన్ని సినిమాలకు రైటింగ్ పరంగా వర్క్ చేశారు హరీష్. అతడికి మళ్లీ 'మిరపకాయ్' చేసే అవకాశం ఇచ్చారు రవితేజ. అక్కడి నుంచి హరీష్ శంకర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్ ముందుకు సాగింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 


Also Readమెగా హీరోలకు బ్లాక్ బస్టర్ నెల... హరిహర వీరమల్లుకు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?



సినిమాలు వదిలేసి అమెరికా వెళ్ళిన రిచా!
'మిరపకాయ్' సినిమాలో రవితేజ సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా నటించారు. తెలుగులో ఆ అమ్మాయికి అది మూడో సినిమా. దానికి ముందు రానా దగ్గుబాటి 'లీడర్', వెంకటేష్ 'నాగవల్లి' చేశారు. ఆ తర్వాత రవితేజతో 'సారొచ్చారు', ప్రభాస్ సరసన 'మిర్చి', నాగార్జున 'భాయ్' సినిమాలలో మెరిశారు. ఆ తర్వాత సినిమాలు వదిలేసి అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికాలో ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు.‌ 'మిరపకాయ్' సినిమాలో రిచా గంగోపాధ్యాయ కాకుండా దీక్ష సెట్ మరొక హీరోయిన్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.