మలయాళ స్టార్ హీరోలు ముమ్ముట్టి (Mammootty), మోహన్ లాల్ (Mohan Lal)లు తమ కెరీర్  బిగినింగ్ నుంచే కలిసి నటించడం మొదలు పెట్టారు. మొత్తం 49 సినిమాలు చేశారు. మధ్యలో సరైన ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో వీరిద్దరి కాంబోకి దశాబ్దం పాటు బ్రేక్ పడింది. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా సమయంలో ఓటీటీని ఊపేసిన మలయాళ సినిమాల్లో ఫహాద్ ఫాజిల్ నటించిన ‘మలిక్’, ‘సీ యూ సూన్’ ఫేమ్ మహేశ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకుడు. కమల్ హాసన్ తో ఓ సినిమా చేయాల్సి ఉండగా, తదితర కారణాల కార్య రూపం దాల్చలేదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ సూపర్ స్టార్స్ కలయికలో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు మహేశ్ నారాయణ్. ఇటీవలే ఈ చిత్రం శ్రీలంక లో ప్రారంభమైంది.  ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని #MMMN  అనే ట్రెండ్ చేస్తున్నారు. 


క్రేజీ కాంబోలో లేడీ సూపర్ స్టార్
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ’తో నయనతార ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ వంటి ప్రముఖులు కూడా ఈ డాక్యుమెంటరీపై ప్రశంసలు కురిపించడం విశేషం. ఆమె తాజా  చిత్రం ‘రక్కయి’ టీజర్ లో యాక్షన్ మోడ్ లో దుమ్ము దులిపేశారంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఓ వైపు లే డీ ఓరియెంటెడ్ చిత్రాలూ చేస్తూనే, తన పాత్రకు ప్రాధాన్యమున్న స్టార్ హీరో చిత్రాలకూ సై అంటున్నారు. తాజాగా ముమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించబోయే చిత్రానికీ సైన్ చేశారు. 


ఇందులో బన్వర్ సింగ్ షెకావత్ కూడా


'పుష్ప 2'తో మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నారు. గతంలో మమ్ముట్టి, మోహన్ లాల్ చిత్రాల్లో కనిపించిన ఆయన... ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించబోయే మహేశ్ నారాయణ్ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. త్వరలోనే ఫహాద్ కూడా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నారు. ‘నాయట్టు’ ఫేమ్ కుంచాకో బోబన్, రంజి పనిక్కర్, ‘హృదయం' ఫేమ్ దర్శనా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చిన్,అబుదాబి, అజర్ బైజాన్ లలో 150 రోజుల పాటు జరగనుంది. ఆంటో జోసఫ్, సి.ఆర్.సలీమ్, సుభాష్ జార్జ్ మాన్యూల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చిత్రాల ఫేమ్ మనుష్ నందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. హీరో కుంచాకో  బోబన్ ‘‘With the Big M’s……’’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన తో పాటు మోహన్ లాల్ , ముమ్ముట్టి లు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.






Also read: రామ్ పోతినేని కొత్త సినిమాలో యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్... అందాల భామను గుర్తు పట్టారా?


ప్రస్తుతం  ‘బజూకా’ తోపాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డోమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ ’ చిత్రాలలో నటిస్తున్నారు ముమ్ముట్టి. ఇక మోహన్ లాల్ విషయానికొస్తే, ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టి, ఓ ఫాంటసీ త్రీడీ చిత్రాన్ని తెరకెకిస్తున్నరు. అంతే కాకుండా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో లూసీఫర్ సీక్వెల్ ‘ఎల్ 2 ఎంపురన్’ లోనూ హీరోగా నటిస్తున్నారు.