Mohan Babu: టాలీవుడ్‌లో డైలాగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ.. పర్సనల్ లైఫ్‌లోనే బిజీ అయిపోయారు. ప్రొఫెషనల్‌గా ఆయన లెగసీని మంచు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి.. ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా మోహన్ బాబు.. తన యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా వచ్చారు. మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో కలిసి ఇందులో పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్‌లో జ్ఞానం విలువను స్టూడెంట్స్‌కు బోధించారు మోహన్ బాబు.


క్యారెక్టరే ముఖ్యం..


‘‘క్యారెక్టర్ లేకుండా జ్ఞానం ఉంటే లాభం లేదు. నా కొడుకు అయినా, కూతురు అయినా ఎవరైనా సరే కాలేజ్‌లో నెంబర్ 1 స్టూడెంట్ అయినా అనవసరం. క్యారెక్టర్ అనేదే ముఖ్యం. చదువు కంటే కూడా క్యారెక్టరే ముఖ్యం. అందుకే నేను అందరికీ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్తుంటాను. క్యాంపస్‌లోకి వచ్చిన తర్వాత ఇది మోహన్ బాబు యూనివర్సిటీ అని మీరు అనుకుంటారు. కానీ కాదు. నేను ఇక్కడికి చదువుకోవడానికే వచ్చాను. సర్టిఫికెట్ తీసుకొని, ఉద్యోగం తెచ్చుకొని అమ్మ, నాన్నను సంతోషపరచాలని అనుకున్నాను’’ అంటూ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు.


జాగ్రత్తగా ప్రవర్తించండి..


‘‘తల్లిదండ్రులు అందరికీ హ్యాట్సాఫ్. వాళ్లందరికీ నాపై, నా యూనివర్సిటీపై నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే నా ఇన్‌స్టిట్యూషన్‌లో అమ్మాయిల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే నా కొడుకులు, కూతురు కంటే వాళ్లే ఎక్కువ. 10 కిలోమీటర్ల వరకు ఈ యూనివర్సిటీని ఎవరూ టచ్ చేయలేరు. ఆ దమ్ము ఎవరికీ లేదు. ఒక ఫ్లైట్ ఎక్కాలంటే మనం సొంతంగా ఎక్కలేము. వారి రూల్స్‌ను ఫాలో అవ్వాల్సిందే. అలాగే యూనివర్సిటీలో అడుగుపెట్టగానే జాగ్రత్తగా ప్రవర్తించండి’’ అంటూ స్టూడెంట్స్‌కు బోధించారు మోహన్ బాబు. అదే రోజు యూనివర్సిటీ ఆన్యువల్ డే సెలబ్రేషన్స్ మాత్రమే కాకుండా మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఇక ఈ ఈవెంట్‌లో రాజకీయాలపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.


పొలిటికల్ స్పీచ్..


తిరుపతిలో ఎంబీయూలో జరిగిన మంచు మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో రాజకీయ ప్రసంగాలు హీట్‌ను పుట్టించాయి. మోహన్‌బాబు మాత్రమే కాదు.. ఆయన కుమారుడు మనోజ్ కూడా పొలిటికల్ స్పీచ్‌‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ స్పీచ్‌లతో ప్రజలకు సూచనలు ఇస్తున్నట్టే ఉన్నా రాజకీయాలపై ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు ఇచ్చారు. నచ్చిన వారికి ఓటు వేసుకోండి అని చెబుతూనే ఎవరికి వేయాలో కూడా చెప్పేశారు. "ప్రధాని నరేంద్ర మోదీని చాలా సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. ఇద్దరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికి వేయండి’’ అంటూ సలహా ఇచ్చారు మోహన్ బాబు.


Also Read: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లోని గ్లాస్‌ డైలాగ్‌పై ఎన్నికల సంఘం ఆరా- నోటీసులు ఇస్తామన్న ముకేష్‌ కుమార్ మీనా