Mohan Babu News Today: మోహన్ బాబు ఎక్కడ? వేర్ ఈజ్ మోహన్ బాబు? కలెక్షన్ కింగ్ కనిపించకుండా పోయారా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది దానిపై ఆయన స్పందించారు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.

నేను ఎక్కడికి పారిపోలేదు - మోహన్ బాబుతన మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ వేదికగా మోహన్ బాబు పేర్కొన్నారు. పుకార్లకు చెక్ పెట్టారు. తనకు ముందస్తు బెయిల్ రాలేదని, తన బెయిల్ రిజెక్ట్ అయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను సొంత ఇంటిలో ఉన్నానని, మెడికల్ కేర్ (చికిత్స) తీసుకుంటున్నానని మోహన్ బాబు వివరించారు. నిజానిజాలు తెలుసుకుని మీడియా ప్రజలకు చెప్పాల్సిందిగా తాను విజ్ఞప్తి చేస్తున్నానని మోహన్ బాబు పేర్కొన్నారు.

ముందస్తు బెయిల్ ఎందుకు? కేసు ఏమిటి?మోహన్ బాబు కుటుంబంలో గత కొద్దిరోజులుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. అన్నదమ్ములు విష్ణు మంచు, మనోజ్ మంచు మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు ఆ ఇంటి గొడవలు వీధికి ఎక్కాయి. తండ్రి తనయులు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా స్టేషన్ మెట్లు ఎక్కడం... తన మీద అజ్ఞాత వ్యక్తులు దాడి చేశారని మనోజ్ కంప్లైంట్ ఇస్తే, తనయుడి మీద నేరుగా కంప్లైంట్ ఇచ్చారు మోహన్ బాబు.

Also Read50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్

మంచు కుటుంబంలో జరుగుతున్న న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన ఓ మీడియా సంస్థ ప్రతినిధి మీద మోహన్ బాబు చేయించుకోవడం వల్ల ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఆ దాడి ఘటనపై మీడియా సంస్థ ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగాయి.‌ ఆ కేసులో మోహన్ బాబు ముందస్తు బయలు కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ రిజెక్ట్ అయిందని, దాంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం మొదలైంది ఆ ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. మరి మీడియా ముందుకు వస్తారా? లేదంటే మరొక విధంగా స్పందన ఇస్తారా అనేది వేచి చూడాలి.

మోహన్ బాబు తనయుడు విష్ణు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక విషయం ఒకటి వెల్లడిస్తానని ట్వీట్ చేసినప్పటికీ... ఆయన మీడియా ముందుకు రాలేదు.‌ బహుశా విష్ణు చెప్పాలనుకున్న మాటను మోహన్ బాబు ట్వీట్ చేశారు అని అనుకోవాలి.

Also Readమిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?