Producer TG Vishwa Prasad Offers Mirai Screens To Pawan OG Movie: తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే అటు సోషల్ మీడియా, ఇటు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. తాజాగా 'మిరాయ్' మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది.
'మిరాయ్' స్క్రీన్లలో 'OG'
యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్' ఈ నెల 12న రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల కలెక్షన్లకు చేరువవుతోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ 'OG' కోసం టీం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం 'మిరాయ్' అడుతున్న అన్నీ థియేటర్ల స్క్రీన్లను పవన్ 'ఓజీ'కి కేటాయించబోతున్నారు.
గురువారం థియేటర్లను కేటాయించి మళ్లీ శుక్రవారం నుంచి 'మిరాయ్' వేయనున్నారు. పవన్ మీద అభిమానంతో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీ, బాక్సాఫీస్ వద్ద హెల్దీ కాంపిటీషన్ అని అంటున్నారు. ఇక 'మిరాయ్' సినిమాలో 'వైబ్ ఉందిలే' సాంగ్‌ను కూడా యాడ్ చేశారు. ఈ పాటతో మంగళవారం నుంచి 'మిరాయ్' థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
Also Read: అమెరికాలో పవన్ 'ఓజీ' బ్లాస్ట్ - 'ఖుషీ' సాంగ్‌తో సెలబ్రేషన్స్... అట్లుంటది మరి మా పవన్ మూవీ అంటే...
'OG'లో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు. చాలా రోజుల తర్వాత 'ఓజాస్ గంభీర'గా పవన్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లోనూ సంబరాలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి ప్రీమియర్ షోస్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.