Teja Sajja's Mirai Movie Box Office Collections: సూపర్ యోధగా యంగ్ హీరో తేజ సజ్జా 'మిరాయ్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫస్ట్ డే నుంచే వసూళ్లలో అదరగొడుతోంది. ఈ నెల 12న రిలీజ్ కాగా... 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
4 రోజుల్లోనే...
వరల్డ్ వైడ్‌గా 'మిరాయ్' మూవీ 4 రోజుల్లో రూ.91.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. 'సూపర్ యోధ బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కంటిన్యూ చేస్తోంది.' అంటూ రాసుకొచ్చింది. ఫస్ట్ డే రూ.27.20 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజుకు రూ.55.60, మూడో రోజుకు రూ.81.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలిపింది. నాలుగో రోజు ఏకంగా రూ.91 కోట్లు దాటి రూ.100 కోట్లకు అతి చేరువలో ఉంది.
మంగళవారానికి రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వారం పెద్ద మూవీస్ ఏమీ లేకపోవడం, వీకెండ్‌తో 'మిరాయ్' కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వచ్చే వారం పవన్ కల్యాణ్ 'OG' రిలీజ్ ఉండడంతో ఆ ఇంపాక్ట్ ఈ కలెక్షన్లపై పడే ప్రభావం ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ మూవీ రిలీజ్‌కు ముందే కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ లోపే ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read: హీరోగా ఎంట్రీ ఇస్తున్న పాపులర్ యూట్యూబర్ - సిల్వర్ స్క్రీన్‌పై హిట్ కొడతాడా?
అశోకుడు రాసిన 9 గ్రంథాల్లో అమరత్వానికి సంబంధించిన తొమ్మిదో గ్రంథాన్ని హస్తగతం చేసుకుని ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటాడు మహావీర్ లామా (మంచు మనోజ్). అతని బారి నుంచి ఆ గ్రంథంతో పాటే మనవాళిని కాపాడిన సూపర్ యోధుడు వేద (తేజ సజ్జా). ఈ స్టోరీనే ప్రధానాంశంగా అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో విజువల్ వండర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు డైరెక్టర్ కార్తీక్. తేజ సజ్జా, మంచు మనోజ్‌ల భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఫిదా అయిపోయారు. తక్కువ బడ్జెట్‌తో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా రూపొందించారంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు.
మూవీలో తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, శ్రియ, జగపతిబాబు, గెటప్ శ్రీను, జయరామ్, కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మించారు.