మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. మలయాళ హీరోల్లో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మమ్ముట్టి తాజాగా తన మరో సినిమా అప్డేట్ ని అందించారు. ఈ ఏడాది తెలుగులో అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమాలో కీలక పాత్ర పోషించారు మమ్ముట్టి. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. కాగా ఇప్పటికే మమ్ముట్టి మలయాళం లో 'బజూకా'(Bazooka) అనే గేమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. డీనో డెన్నిస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ చేసేందుకు సిద్ధమయ్యారు మమ్ముట్టి.


'భ్రమయుగం'(Brama Yugam) పేరుతో తెరకెక్కునున్న ఈ సినిమా ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేరళలో నిర్వహించిన కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా మూవీ టీం ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్లో డార్క్ షేడ్స్ లో ఉన్న ఓ ఇల్లు కనిపిస్తుండగా, దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడ పట్టుకొని ఉన్నాడు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రాహుల్ సదా శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.






పూజా కార్యక్రమాలతో పాటు సినిమా షూటింగ్ కూడా ఈ రోజే మొదలుపెట్టారు చిత్ర బంధం. కేరళలోని కొచ్చిలో ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది. ఇక మూవీ లాంచ్ సందర్భంగా మమ్ముట్టి తన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు." భ్రమయుగం ఒక ఉత్తేజ కరమైన చిత్రం. ఇందులో నేను మునుపెన్నడూ పోషించని పాత్రను పోషిస్తున్నందున ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నాను. దర్శకుడు రాహుల్ అద్భుతమైన ప్రతిభ, నిర్మాతలు రామ్ - శశి ల అభిరుచి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేశాయి" అంటూ పేర్కొన్నారు మమ్ముట్టి.






ఇక దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ.." మమ్ముటి సినిమాకి దర్శకత్వం వహించాలనే కలను సహకారం చేసుకుంటున్నందుకుగాను చాలా సంతోషంగా ఉంది. 'భ్రమయుగం' అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథ. దీన్ని మరింత అద్భుతంగా మలచడానికి నిర్మాతల సహకారం లభించినందుకు సంతోషిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మమ్ముట్టి అభిమానులకు మరియు ఈ జానర్ ని ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నా" అని అన్నారు. 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా లిజ్ ఇతర కీలక పాతల్రు పోషిస్తున్నారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు.


Also Read : ఆంధ్ర ప్రజలు అప్పుడు తప్పు చేశారు, ఇప్పుడు అనుభవిసున్నారు - కోటా శ్రీనివాసరావు కామెంట్స్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial