Chiranjeevi Special Wishes To Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటికి సరిగ్గా 18 ఏళ్లు. పూరీ జగన్నాథ్ 'చిరుత' మూవీతో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అయిన ఆయన మగధీర, రంగస్థలం, RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో తండ్రి మెగాస్టార్‌కు తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. తన డ్యాన్స్, నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు చరణ్. ఈ సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు ఎదుగుదలను గుర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా ఆ క్షణం...
చరణ్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. '18 ఏళ్ల క్రితం 'చిరుత'తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం... నాన్నగా నేను ఎప్పటికీ మరిచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
తండ్రిగా నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలను నువ్వు అధిరోహించాలి. అని కోరుకుంటూ విజయోస్తు..' అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా... మెగా ఫ్యాన్స్ నుంచి విషెష్ వెల్లువెత్తుతున్నాయి.
Also Read: 'వరాహ రూపం'ను మించి 'బ్రహ్మ కలశ' - 'కాంతార' ప్రీక్వెల్ డివోషనల్ సాంగ్ స్పెషల్ ఏంటో తెలుసా?
'పెద్ది' టీం స్పెషల్ విషెష్
ఈ సందర్భంగా 'పెద్ది' మూవీ టీం కూడా స్పెషల్ విషెష్ చెప్పింది. 'మా 'పెద్ది' 18 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. తెరపై ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే బయట వినయ విధేయతలతో ఓ ప్రత్యేక పంథాను ఏర్పాటు చేసుకున్నారు. మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు. 'పెద్ది' నుంచి చాలా పెద్ద సర్ ప్రైజ్‌లు మొదలు కాబోతున్నాయి.' అంటూ రాసుకొచ్చారు.
గ్లోబల్ స్టార్ ట్యాగ్ నుంచి...
పాన్ ఇండియా మూవీ 'RRR' తర్వాత చరణ్‌ను గ్లోబల్ స్టార్ అంటూ అటు ఇండస్ట్రీ పెద్దలు, ఇటు ఫ్యాన్స్ అనేవారు. ఇక ఇప్పుడు మళ్లీ పాత ట్యాగ్ 'మెగా పవర్ స్టార్'కే మారారు చరణ్. తాజాగా 'పెద్ది' మూవీ టీం రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక దసరా సందర్భంగా పెద్ది నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.