Kantara Chapter 1 Brahmakalasha Song Released: 'కాంతార'... ఈ పేరు వింటేనే మనకు సంస్కృతి, సంప్రదాయం, అడవి తల్లి జానపదం గుర్తొస్తాయి. ముఖ్యంగా 'వరాహ రూపం...' పాట వింటేనే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈ పాట లేకుంటే సినిమానే లేదు అనేలా వేరే లెవల్‌లో ఉంటుంది. 2022లో వచ్చిన 'కాంతార'తో పాటే ఈ పాట కూడా ట్రెండ్ అయ్యింది. పుంజుర్లి దేవుని వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా లిరిక్స్, మ్యూజిక్ అందించారు మేకర్స్. ఈ పాటను శశిరాజ్ కపూర్ రాయగా.. సాయి విఘ్నేష్ పాడారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.

Continues below advertisement

ఇప్పుడు 'కాంతార'కు ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ట్రైలర్ వేరే లెవల్‌లో ఉండగా తాజాగా ఫస్ట్ సింగిల్, డివోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

'బ్రహ్మ కలశ'... అదుర్స్

Continues below advertisement

'వరాహ రూపం' పాటను మించిపోయేలా 'కాంతార చాప్టర్ 1'లో డివోషనల్ సాంగ్ కంపోజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ మ్యూజిక్ నుంచి లిరిక్స్ వరకూ జానపదంతో పాటు శివునిపై భక్తి ప్రపత్తులు ఉట్టి పడేలా ఉన్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 'తెలీదు శివుడా భక్తి మార్గము. గుండెల నిండా నువ్వు దైవ రూపము.' అంటూ శివుని భక్తి శ్రద్ధలతో ఎలా పూజించాలో చెప్పే విధంగా ఉన్న పాట గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా... అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. 'వరాహ రూపం' సాంగ్ థీమ్‌తోనే మ్యూజిక్ ప్రారంభం కాగా... చివరకు వేరే లెవల్‌లో ఉంది.

Also Read: 'OG' హంగ్రీ చీటా... ఫ్యాన్స్‌కు పూనకాలే - పాట వెనుక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్... పవన్ ఫైర్‌ను చదివేశాడుగా...

ట్రెండింగ్‌లో ట్రైలర్...

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'అడవి తల్లి జానపదం ఓ అద్భుతం' అనేలా ఫస్ట్ పార్ట్‌ ఎక్కడ ఎండ్ అయ్యిందో దానికి ముందు జరిగిన ఘటనలు, శివుని గణాలతో పాటు పుంజుర్లి దేవునికి సంబంధించి పూర్తి వివరాలను ఈ ప్రీక్వెల్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. 'నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు?'  అనే ఓ కొడుకు ప్రశ్నతో ట్రైలర్ ప్రారంభం కాగా... మట్టి కథను సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా చూపించారు. పూర్వీకుల దంత కథ నుంచి రాజు కథ, 'కాంతార'లో తెగకు రాజుకు మధ్య యుద్ధం. 

రాజు నుంచి తమ వారిని కాపాడుకునేందుకు ఆ తెగ నాయకుడు ఏం చేశాడు. యువరాణి తెగ నాయకున్ని ఇష్టపడడం దగ్గర నుంచి ధర్మం కోసం దైవ శక్తి తెగ నాయకునికి ఏం సహాయం చేసింది? అనేది సస్పెన్స్. ఇక ట్రైలర్ లాస్ట్‌లో చేతిలో త్రిశూలంతో సాక్షాత్తూ శివయ్యే దర్శనమిచ్చాడా? అనేలా రిషభ్ ఎలివేషన్ వేరే లెవల్. 

మూవీలో రిషభ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రిషభ్ ప్రధాన పాత్ర పోషిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ భాషల్లో అక్టోబర్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.