Chiranjeevi's Mana Shankara Vara Prasad Garu First Single Promo: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న కామెడీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి దసరా స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసింది మూవీ టీం.
ఫస్ట్ సింగిల్ ప్రోమో అదుర్స్
స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట ప్రోమో అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో హిట్ సాంగ్స్‌ను పాడారు ఉదిత్ నారాయణ. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. 'ఓయ్ మీసాల పిల్ల' అంటూ ఫుల్ జోష్‌తో మెగాస్టార్ చిరు నయనతారను ముద్దుగా పిలవగా... 'వాట్ ఏమన్నావ్ ఏదో తిట్టావ్?' అంటూ నయన్ ప్రశ్నించగా... 'అదేం తిట్టు కాదు. మా ఊళ్లో కుర్రాళ్లు పొగరబోతు పిల్లను క్యూట్‌గా మీసాల పిల్ల అని పిలుస్తారు.' అంటూ చెప్పగా జోష్‌తో మ్యూజిక్ మొదలవుతుంది. 'మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మెగా గ్రేస్ రెడీ అవుతుందంటూ టీం అనౌన్స్ చేయగా... త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది.
ప్రోమో రిలీజ్‌కు ముందు సింగర్ ఉదిత్ నారాయణతో డైరెక్టర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో చేసిన ఫన్ వీడియో వైరల్ అవుతోంది. ఆయన్ను ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో మెగాస్టార్ అప్పటి హిట్ సాంగ్స్ టచ్ చేశారు ఉదిత్.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్... మమ్ముట్టి, మోహన్ లాల్, నయన్ సినిమా టీజర్ చూశారా?
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్, లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. చిరు సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండగా... ఆమె శశిరేఖ పాత్రలో కనిపించనున్నారు. నయన్ బ్యూటిఫుల్ లుక్ సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఫస్టాఫ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా కేరళలో షెడ్యూల్ కంప్లీట్ చేశారు మేకర్స్. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కూడా సాగుతోంది. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఈ నెల 5 నుంచి షూటింగ్‌లో భాగం కానున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీలో చిరంజీవి, నయనతారలతో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, మురళీ ధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన చిరంజీవి వింటేజ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.