Mega Fans Fire On Allu Arjun : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22. టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ వన్ మెగాస్టార్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు. అయితే, ఒక సెలబ్రిటీ పెట్టిన విషెస్‌పై మాత్రం మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీ విషెస్ మాకు వద్దు అంటూ చిరు ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. కారణం.. అల్లు అర్జున్ వ్యవహార శైలి. మొన్నటి ఎన్నికల్లో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు బుధవారం జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో బన్నీ కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి
అసలు ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద్భంగా సెలబ్రిటీలంతా విషెస్ తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ కి ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. "మన మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. "నీ విషెస్ మాకు వద్దు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయని, దాని వల్ల ఈసారి సాదాసీదాగా శుభాకాంక్షలు చెప్పారని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్.
ఈసారే అలా చెప్పారా?
ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్ ఈసారి మాత్రమే అలా సింపుల్ గా విష్ చేశారా? అంటే కాదు. గత పదేళ్లుగా ఆయన చిరంజీవిని అలానే విష్ చేస్తున్నారు. ప్రతి ఏడాది సింపుల్ గా విష్ చేస్తూ వచ్చారు బన్నీ. 'మెగాస్టార్ కి హ్యాపీ బర్త్ డే', 'వన్ అండ్ ఓన్లీ వన్ మెగాస్టార్ కి హ్యాపీ బర్త్ డే', 'హ్యాపీ బర్త్ డే బాస్' అంటూ ఇలా విష్ చేశారు ఆయన. ఇక కొన్నిసార్లు మాత్రం చిరుతో దిగిన ఫొటోలను పెట్టి విష్ చేశారు బన్నీ. అప్పుడు ఇప్పుడు ఒకేలా విష్ చేశారు అల్లు అర్జున్. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన చెప్పిన విషెస్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
అసలు వివాదం ఏంటి?
నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. ఏపీ ఎన్నికల నాటిది. మెగా ఫ్యామిలీ అంతా.. పవన్ కల్యాణ్ కి, జనసేనకి సపోర్ట్ చేశారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలో వైసీపీ ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. దీంతో ఫ్యాన్స్ అప్పుడు ఆయనపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నాగబాబు మాట్లాడిన కొన్ని మాటలు అల్లు అర్జున్ ని ఉద్దేశించినవే అని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. సాయి దర్గ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం లాంటివి జరిగాయి. మొన్నీ మధ్య పవన్ కల్యాణ్ కూడా పుష్ప సినిమాపై కామెంట్స్ చేయడం వైరల్ అయింది. ఒకప్పుడు హీరో అడవులను రక్షించేలా సినిమాలు చేసే వాళ్లని ఇప్పుడు మాత్రం స్మగ్లర్లుగా అడవిని కొల్లగొట్టే వారుగా నటిస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.
ఈ వివాదం కొనసాగుతుండగానే బుధవారం ఒక సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాను నమ్మిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ అభ్యర్థి కోసం చేసిన ప్రచారంపైనే కామెంట్ చేశారని అంటున్నారు. దీనిపై ఓపెన్‌గానే అభిమానులు మండిపడ్డారు. ఇంద్ర సినిమా రీ రిలీజ్‌కు వచ్చిన ఫ్యాన్స్ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసే వీడియోలు, విమర్శించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయు.
Also Read: మాట మార్చిన అల్లు అర్జున్... పాత వీడియోలు తీసి మరీ ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్