Chiranjeevi Dance Video : 'జవాన్' టైటిల్ సాంగ్‌కు మెగాస్టార్ డ్యాన్స్ - చిరుని ఎంకరేజ్ చేసిన చరణ్, వీడియో వైరల్!

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో 'జవాన్' టైటిల్ సాంగ్ కి డ్యాన్స్ చేయడం విశేషం.

Continues below advertisement

Megastar Chiranjeevi Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ డాన్స్ వీడియో ఒకటి తెగ వైరల్ గా మారుతుంది. ఈ వీడియోలో చిరు మరోసారి తన గ్రేస్ తో అదరగొట్టేసారు. ఆరుపదుల వయసులోనూ మెగాస్టార్ గ్రేస్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనకే కాకుండా డాన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆరుపదుల వయసులోనూ మెగాస్టార్ తన డాన్స్ తో ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అప్పటికీ, ఇప్పటికీ మెగాస్టార్ డాన్స్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. తెర మీదే కాదు తెర వెనుక కూడా చిరంజీవి చాలా జోష్ గా ఉంటారనే విషయం తెలిసిందే కదా.

Continues below advertisement

తాజాగా మెగాస్టార్ ఇంట్లో దివాళి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా చిరు డాన్స్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీపావళి పార్టీలో చిరంజీవి ఓ రాప్ సింగర్ తో డాన్స్ చేశారు. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలోని పాటకు ఫుల్ జోష్ తో అదిరిపోయే గ్రేస్ తో స్టెప్పులు వేశారు. ఈ వీడియోలో ప్రముఖ ఇండియన్ ర్యాపర్ రాజకుమారి చిరుతో స్టెప్పులేసింది. రాజకుమారి జవాన్ టైటిల్ సాంగ్(Jawan Titile Song) పాడుతుండగా దానికి చిరంజీవి తనదైన స్వాగ్ తో డాన్స్ చేశారు. మరో విశేషమేంటంటే తన తండ్రి డాన్స్ చేస్తుంటే రామ్ చరణ్ పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ మెగాస్టార్ డాన్స్ కి ఫిదా అయిపోతున్నారు.

మెగాస్టార్ వేసిన డాన్స్ పార్టీలోనే హైలెట్ గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ ఈ వీడియోని నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ ఇంట్లో నిర్వహించిన దీపావళి గ్రాండ్ పార్టీకి మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్ లతోపాటు మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు. మనవరాలు పుట్టిన తర్వాత వచ్చిన తొలి దీపావళి పండుగ కావడంతో మెగాస్టార్ తన ఇంట్లోనే ఎంతో ఘనంగా వేడుక నిర్వహించారు. మెగా దివాళి సెలబ్రేషన్స్(Diwali Celebrations) కి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక చిరు సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య'(Veltheru Verrayya) సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత చేసిన 'భోళా శంకర్'(Bholashankar) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్టతో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ ప్రాజెక్టు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇటీవలే ఎం. ఎం కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రంలో చిరు సరసన అనుష్క హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరియర్ లో 157వ సినిమా ఇది. ముల్లోకాల నేపథ్య కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'విశ్వంభర'(Vishwambhara) అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : జర్నలిస్టులు, ఆత్మహత్యల నేపథ్యంలో 'దూత' - నాగచైతన్య ఫస్ట్ లుక్ వచ్చేసిందోయ్!

Continues below advertisement