Meera Jasmine Father Death: సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ గురువారం కన్నుమూశారు. ఎర్నాకులంలోని ఆయన నివాసంలో జోసెఫ్ మరణించినట్టు తెలిసింది. 83 ఏళ్ల వయసు ఉన్న జోసెఫ్ ఫిలిప్.. కొన్నాళ్లకు వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు సమాచారం. తనకు, భార్య ఆలెయమ్మ జోసెఫ్‌కు మీరా జాస్మిన్ కాకుండా మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు.






కొత్తగా రీ ఎంట్రీ..


తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మీరా జాస్మిన్.. మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. మూడు భాషల్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో తను నటించింది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత తానే స్వయంగా మూవీస్ నుండి బ్రేక్ తీసుకుంది. మళ్లీ చాలాకాలం తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు పక్కింటి అమ్మాయి పాత్రల్లో నటించిన మీరా జాస్మిన్.. గ్లామర్ డోస్ పెంచేసిందేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అలా మెల్లగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఒకప్పుడు నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న క్రమంలో అందరిలాగానే మీరా జాస్మిన్‌కు కూడా ప్రేక్షకుల నుండి ప్రోత్సాహం అందింది.


ముందుగా తమిళంలో..


తెలుగులో కంటే తమిళంలోనే ముందుగా స్టార్‌డమ్‌ను అందుకుంది మీరా జాస్మిన్. ‘రన్‌’, ‘యువ’ సినిమాల్లో మాధన్ తో కలిసి నటించింది. ముఖ్యంగా ‘యువ’ మూవీకి తనకు కోలీవుడ్‌లో ఎనలేని పాపులారిటీని దక్కేలా చేసింది. అటు సిటీ అమ్మాయిలాగా, ఇటు పల్లెటూరి పక్కింటమ్మాయిగా.. రెండు విధాలుగా మీరా జాస్మిన్ ప్రేక్షకులను ఆకట్టుకోగలదని నిరూపించింది. అలా తెలుగులో ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అదే తరహాలో గుడుంబా శంకర్‌’, ‘భద్ర’, ‘రారాజు’, ‘మహారథి’, ‘బంగారు బాబు’ లాంటి చిత్రాలు చేసింది. అలా తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.


పెద్దగా కారణాలు లేవు..


చాలాకాలం తర్వాత ‘విమానం’తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది మీరా జాస్మిన్. ఆ మూవీలో క్లైమాక్స్‌లో ఎయిర్ హోస్టెస్ పాత్రలో కాసేపు కనిపించి అందరికీ షాకిచ్చింది. దీంతో ఈ భామ.. తెలుగులో కూడా నటించడానికి సిద్ధంగా ఉందని మేకర్స్‌కు అర్థమయ్యింది. కొన్నిరోజుల క్రితం తమిళంలో ‘క్వీన్ ఎలిజెబెత్’, ‘టెస్ట్’ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అయితే ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉండడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మీరా జాస్మిన్. సెకండ్ ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ అంతా మళ్లీ కొత్తగా ఉందంటూ, మళ్లీ నటిగా కొత్తగా ప్రయాణం మొదలుపెడుతున్నట్టు అనిపిస్తుందని తెలిపింది.


Also Read: ఆంటీ అనడానికి.. నేను మీ చుట్టాన్ని కాదు, నాకు సింపథీ అక్కర్లేదు - అనసూయ సెటైర్లు విజయ్‌ దేవరకొండ పైనేనా?