Mathu Vadalara 2 Day 2 Collection: రెండో రోజూ దుమ్ము దులిపిన 'మత్తు వదలరా 2' - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Mathu Vadalara 2 Box Office Collection: శ్రీ సింహ కోడూరి, సత్య నటించిన 'మత్తు వదలరా 2' బాక్సాఫీస్ వారిలో దుమ్ము దులుపుతోంది. మరి, ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Two Days Collection of Mathu Vadalara 2 Movie Worldwide: బాక్స్ ఆఫీస్ బరిలో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన 'మత్తు వదలరా 2' దూకుడు చూపిస్తోంది. ఈ సినిమా జోరు తగ్గించడానికి అసలు వెనుకాడటం లేదు. రెండు రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో 'మత్తు వదలరా 2' కలెక్షన్స్ ఎంత? అనేది చూస్తే...
రెండో రోజు రూ. 5.7 కోట్లు... టోటల్ 11 కోట్లు!
Mathu Vadalara 2 Day 2 Collection: 'మత్తు వదలరా 2' సినిమా తొలి రోజు 5 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ క్లాప్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. రెండో రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ నమోదు చేసింది. 'మత్తు వదలరా 2' శనివారం నాడు 5 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసిందని నిర్మాతలు విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది.
రెండు రోజుల్లో 'మత్తు వదలరా 2' సినిమాకు రూ. 11 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని క్లాప్ ఎంటర్టైన్మెంట్, అలాగే సినిమా ప్రజెంటర్ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించాయి.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు...
ఇటీవల కాలంలో ఇంతిలా నవ్వించిన సినిమా మరొకటి లేదని 'మత్తు వదలరా 2' గురించి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పేర్కొంటున్నారు. ఒకవైపు శ్రీ సింహ బాగా చేశాడని హీరో గురించి చెబుతూ... మరోవైపు కమెడియన్ సత్య గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సత్య గురించి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. సత్య కామెడీ సినిమాకు బలం అయ్యిందని, అతను పంచిన నవ్వులు విజయాన్ని చేకూర్చాయని సామాన్యుల సైతం చెబుతున్నారు.
Also Read: హాలీవుడ్ రేంజ్‌లో 'దేవర'... ఒక్క ఫైట్‌కు 10 నైట్స్ - సైఫ్ మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ
మత్తు వదలరా మూడో పార్ట్ కూడా!
Mathu Vadalara 3 Movie: 'మత్తు వదలరా 2' సినిమా విజయం సాధించడంతో దర్శకుడు రితేష్ రానా సంతోషం వ్యక్తం చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా తమ నిర్మాత చెర్రీ ముఖంలో నవ్వు చూడడం తనకు ఆనందంగా ఉందన్నారు. దీనికి ముందు తీసిన హ్యాపీ బర్త్ డే అంతగా ఆడకపోవడంతో కాస్త బాధపడ్డానని అన్నారు. ఇప్పుడు ఆయన మోములో సంతోషం కనిపించిందన్నారు. ఈ సంతోషంలో సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించగా... ఫరియా అబ్దుల్లా, సునీల్, రోహిణి, 'జబర్దస్త్' రోహిణి తదితరులు నటించారు.
Also Read: 'దేవర' కథ లీక్ చేసిన ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ - స్టోరీ మెయిన్ పాయింట్ రివీల్ చేసేశారుగా