Mathu Vadalara 2 Collection Day 3: మూడో రోజూ తగ్గని జోరు... 'మత్తు వదలరా 2' ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

Mathu Vadalara 2 Movie Collection: 'మత్తు వదలరా 2' సినిమా దూకుడు కంటిన్యూ అవుతోంది. మూడో రోజూ మంచి వసూళ్లు సాధించిందీ శ్రీ సింహ, సత్య సినిమా. మరి, ఈ సినిమాకు టోటల్ ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే?

Continues below advertisement

బాక్సాఫీస్ బరిలో 'మత్తు వదలరా 2' సినిమా జోరు హుషారు కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్, విశాఖ వంటి నగరాలలో ఆదివారం వినాయక నిమజ్జనం సందడి నెలకొంది. ప్రజలు చాలా మంది పెద్ద ఎత్తున నిమజ్జనాలలో పాల్గొన్నారు.‌ అయినా సరే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చారు. సినిమా చూశారు. దాంతో ఓపెనింగ్ వీకెండ్ 'మత్తు వదలరా 2'కు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

Continues below advertisement

మూడు రోజుల్లో మత్తు వదలరా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Mathu Vadalara 2 movie first weekend collection: శ్రీ సింహ కోడూరు, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాకు రెండు రోజుల్లో 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మూడో రోజు ఐదు కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసిందని, మొత్తం మూడు రోజుల్లో 16 కోట్ల 20 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయని పేర్కొన్నారు.

Also Read: లైవ్‌లో షకీరాకు చేదు అనుభవం - షార్ట్ డ్రస్ వేసినప్పుడు ఇన్నర్స్‌ కనిపించేలా అసభ్యంగా వీడియోలు తీయడంతో...

కామెడీతో హిట్ కొట్టిన రితేష్ రానా అండ్ టీం
శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా పరిచయమైన 'మత్తు వదలరా' సినిమాతో దర్శకుడు రితేష్ రానా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా తీసుకు వచ్చింది. అయితే ఆ తర్వాత లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితీష్ రానా రూపొందించిన 'హ్యాపీ బర్త్ డే' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో మళ్లీ తనకు విజయాన్ని అందించిన 'మత్తు వదలరా'కు సీక్వెల్ తీశారు.


వినోదాత్మక సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుందని 'మత్తు వదలరా  2' మరోసారి నిరూపించింది. ఏసుదాసు పాత్రలో కమెడియన్స్ సత్య నటనకు ప్రేక్షకులు జేజేలు కొడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి పాటకు సత్య వేసిన స్టెప్పులు థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. కామెడీతో విజయం అందుకున్న చిత్రం ఇది.

Also Readజానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...


శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాలో సీనియర్ కమెడియన్ సునీల్, నటి రోహిణి, ఝాన్సీ తదితరులు కీలకపాత్రలో నటించారు ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మీద చెర్రీ, హేమలత ప్రొడ్యూస్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సినిమా రూపొందింది. శ్రీ సింహ కోడూరి సోదరుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని రితేష్ రానా ప్రకటించారు

Continues below advertisement