తమిళనాడులో రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత సొంతం చేసుకున్నారు దళపతి జోసెఫ్ విజయ్. దాంతో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, అలాగే అన్నా డీఎంకే పార్టీలు ప్రతిపక్షంలో కూర్చుకున్నాయి. జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ముఖ్యమంత్రి అయ్యాక ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అందులో కరెంట్ కోతలు (Tamil Nadu Power Cuts) ఒకటి. ఆ అంశంలో సీఎంకు మద్దతుగా నిలిచారు ఓ యువ నటుడు.
అధికారంలోకి వచ్చి 35 రోజులే...అప్పుడే విమర్శలు ఏంటి? తప్పు ఎవరిది?తమిళనాడులో కరెంట్ కోతలతో పాటు మహిళలపై నేరాలు పెరిగాయని, అందుకు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ బాధ్యత వహించాలని ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈ అంశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులో ఓ యువ కథానాయకుడు ఎంటరయ్యాడు.
మోహన్ బాబు 'పెదరాయుడు', రజనీకాంత్ 'ముత్తు', వెంకటేష్ 'దేవి' సహా ఎన్టీఆర్ 'సింహాద్రి' వరకు పలు సినిమాల్లో బాల నటుడిగా మెప్పించారు మాస్టర్ మహేంద్రన్. ఇప్పుడు ఆయన హీరో అయ్యారు. 'వసుదేవ సుతం'తో జూలై 10న థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో తమిళ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయాన్ని గుర్తు చేశారు ఓ జర్నలిస్ట్.
Also Read: Vijay Trisha Breakup - విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
చెన్నైలో (తమిళనాడులో) కరెంట్ కోతల గురించి మీ మాటలు వైరల్ అయ్యాయి. అసలు ఏంటి విషయం? అని అడగ్గా... ''ప్రజల కష్టం గురించి నేను మాట్లాడాను. సరే... మహేంద్రన్ మాట్లాడాడు కదా! కొంచెం వాడదామని నన్ను వాడుకున్నారు. 75 ఏళ్ళుగా తమిళనాడును రెండు పార్టీలు పాలించాయి. విజయ్ గారి సీఎం అయ్యి 35 రోజులే అయ్యింది. 75 ఏళ్ళుగా పాలించిన వాళ్ళను ప్రశ్నించడం మానేసి, వాళ్ళను వదిలేసి... సీఎంగా 35 రోజులు నుంచి ఉన్న వ్యక్తిని ఎందుకు 'పవర్ పోయింది?' అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎలా సమాధానం చెబుతారు. పెళ్ళి అయిన మర్నాడు పిల్లలు పుడతారా? తొమ్మిది నెలలు సమయం కావాలి కదా. ఇదీ అంతే... విజయ్ గారికి కొంత టైమ్ ఇవ్వండి'' అని మాస్టర్ మహేంద్రన్ చెప్పారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని, అయితే కొత్త ముఖ్యమంత్రికి కొంత సమయం ఇవ్వాలని ఆయన చెబుతున్నారు.
అసలు మహేంద్ర ఏమన్నారు? ఇష్యూ ఏమిటి?చెన్నైలో కరెంట్ కోతలపై ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మహేంద్రన్ మాట్లాడుతూ... ''ప్రతి అంశాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మైక్రో ఫోన్స్ ముందు మాట్లాడటం వల్ల పరిష్కారం లభించదు. మీరు చాలా రోజుల నుంచి పవర్ ఇష్యూలు లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేశారు కదా! ఒక్క ఆరు నెలలు వెయిట్ చేయలేరా?'' అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తనకు ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదని ఆయన చెప్పారు.
Also Read: Ram Charan - మల్టీప్లెక్స్‌లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు
