'పెద్ది'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు ప్రశంసలు లభించాయి. అయితే... బాక్సాఫీస్ బరిలో ఆశించిన స్థాయిలో సినిమాకు కలెక్షన్లు రాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, తెలుగులో వసూళ్ళ సునామీ సృష్టించింది. 'పెద్ది' సినిమా విడుదల తర్వాత తొలిసారి జాతీయ వేదికపై రామ్ చరణ్ కనిపించారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమ్మిట్ 2026'లో ఆయన పాల్గొన్నారు. అందులో పాప్ కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

రామ్ చరణ్ కామెంట్... మల్టీప్లెక్స్‌లకు షాక్! ఇండియాలో ఇప్పటికీ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నారు రామ్ చరణ్. ఇంకా ఆయన మాట్లాడుతూ... "మన దేశంలో నేటికీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న అతి చౌకైన వినోద సాధనం సినిమా మాత్రమే. కుటుంబంతో కలిసి అందరూ థియేటర్‌కు వెళ్లి... వెండితెరపై సినిమా చూస్తూ ఎక్స్‌పీరియన్స్‌ చేయడం అనేది ఓ కమ్యూనిటీ యాక్టివిటీ. సినిమా చూడటం కేవలం కాలక్షేపం మాత్రమే కాదు... మన కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు వేదికగా నిలుస్తుంది'' అని చెప్పారు.

'గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్' ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమ్మిట్‌లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇండియాలో సినిమా, ప్రేక్షకుల అనుబంధం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా విషయంలో ఒక్కరి నుంచి వినబడుతున్న ప్రధాన విమర్శ, సమస్య - టికెట్ రేట్లు. టికెట్స్ కంటే ముఖ్యంగా పాప్ కార్న్ రేట్లు. ఆ అంశంలో నిర్మొహమాటంగా, ధైర్యంగా తన అభిప్రాయాలను - అలాగే ప్రేక్షకులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రస్తావించారు.

Continues below advertisement

Also Read: Maa Inti Bangaram Day 4 Collections - 50 కోట్ల క్లబ్బులోకి సమంత బంగారం... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంత? ఎన్ని కోట్లు వచ్చాయంటే?

''థియేటర్లలో పాప్‌ కార్న్ రేట్లు కొంచెం తగ్గితే... ప్రేక్షకులకు సినిమా ఎక్స్‌పీరియన్స్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ విపరీతంగా పెరగడంపై మెజారిటీ ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ రేట్స్ వల్ల కొంత మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్నారు. వెనుకంజ వేస్తున్నారు'' అని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు మల్టీప్లెక్స్‌లకు షాక్ అని చెప్పాలి. పీవీఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లో రేట్స్ మీద ఎప్పట్నుంచో ప్రేక్షకులలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ వ్యాఖ్యలకు అటువంటి మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలకు షాక్ అని చెప్పాలి.

Also Read: Samantha Meets Chiranjeevi: సమంతకు మెగా అభినందనలు... చిరంజీవిని కలిసిన సామ్ & రాజ్... స్పెషల్ మూమెంట్ ఫోటోలు

సాధారణ ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్యను జాతీయ వేదికపై రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ప్రస్తావించడం నిజంగా అభినందనీయమని పలువురు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. ఆల్రెడీ వస్తున్న వ్యతిరేకత, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. 

Also Read: Nandamuri Balakrishna - అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం