Mass Jathara: 'మాస్ జాతర' హంగామా మొదలైంది. సూర్య ముఖ్య అతిథిగా వచ్చిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో మంచి బజ్ వచ్చింది. సినిమా సైతం హిట్ అవుతుందని మాస్ మహారాజా రవితేజ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే ట్రైలర్ ఇదొక రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ డ్రామా అనేలా ఉంది. అయితే ఆ కథలో అసలు విషయం ఒకటి పెద్దగా టచ్ చేయలేదు. అదీ ఘాటీ ఎఫెక్ట్ వల్ల అని టాక్. ఇంతకీ అది ఏమిటో తెలుసా?
గంజాయి నేపథ్యంలో 'మాస్ జాతర'?Mass Jathara Movie Story: 'మాస్ జాతర'లో హీరోది రైల్వే ఆఫీసర్ క్యారెక్టర్ అని కన్ఫర్మ్ చేశారు. హీరోయిన్ శ్రీకాకుళం అమ్మాయి అని స్పష్టం చేశారు. సో... ఈ కథ శ్రీకాకుళం నేపథ్యంలో జరుగుతుంది. ట్రైలర్ స్టార్టింగ్ గమనిస్తే... 'కేజీ, రెండు కేజీలు కాదురా... ఇరవై టన్నులు! ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైనులో ఎక్కించండి' అని విలన్ నవీన్ చంద్ర డైలాగ్ ఒకటి వినబడుతుంది. ఆ ఇరవై టన్నులు మరేదో కాదని, గంజాయి అని సమాచారం.
గంజాయి నేపథ్యంలో కమర్షియల్ పంథాలో 'మాస్ జాతర'ను తెరకెక్కించారని ఫిల్మ్ నగర్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల వచ్చిన అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి 'ఘాటీ' సైతం గంజాయి నేపథ్యంలో తెరకెక్కింది. అందులోనూ విలన్ గంజాయి మాఫియాకు నాయకుడిగా కనిపిస్తాడు. 'మాస్ జాతర'లో నవీన్ చంద్ర రోల్ సైతం అదేనని తెలిసింది. అయితే... రెండిటిని తెరకెక్కించిన తీరు మాత్రం వేర్వేరుగా ఉంటుందట.
Also Read: రైటర్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు... అవికా గోర్ ఫస్ట్ బుక్ రేటు ఎంతో తెలుసా?
రవితేజను ఎలా అయితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో ఆ విధంగా సినిమా ఉంటుందని, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ పంథాలో సినిమా తీశారని తెలిసింది. 'ఘాటీ', 'మాస్ జాతర'... రెండిటిలో గంజాయి అనేది కామన్ పాయింట్ అయినా సరే రెండు సినిమాలకు ఎక్కడా పోలిక ఉండదట. అందుకే, ట్రైలర్ వరకు గంజాయి అనే పదం వినిపించకుండా కట్ చేశారు. రవితేజ, నవీన్ చంద్ర మధ్య ఫైట్స్ కుమ్మేశాయట. ఆక్టోబర్ 31న పెయిడ్ ప్రీమియర్ షోస్ ద్వారా రిలీజ్ అవుతున్న 'మాస్ జాతర'తో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.
Also Read: వారెవ్వా నవీన్ చంద్ర... విలనిజం ఇరగదీశాడుగా - లుక్ నుంచి యాక్టింగ్ వరకూ... రవితేజకు ధీటుగా!