ఈరోజుల్లో రీమేక్ అయిన సినిమాలు హిట్ అవుతాయి అనే గ్యారెంటీ లేదు. మూవీ లవర్స్ అంతా చాలావరకు ఇతర భాషల సినిమాలను ఒరిజినల్ భాషల్లోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అలాంటి సినిమాలను రీమేక్ చేస్తే.. అవి వర్కవుట్ అయ్యే ఛాన్సులు తక్కువ. కానీ ఒకప్పుడు అలా కాదు.. ఒక భాషలో ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలు.. దానిని వేరే భాషలో రీమేక్ చేసి లాభాలు సంపాదించుకునేవారు మేకర్స్. ఇక ‘మర్యాదరామన్న’ లాంటి బ్లాక్‌బస్టర్ తెలుగు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న అజయ్ దేవగన్.. ఇప్పుడు దాని సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 


ఎన్నో భాషల్లో రీమేక్ అయిన ‘మర్యాదరామన్న’


‘మగధీర’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన తక్కువ బడ్జెట్ చిత్రమే ‘మర్యాదరామన్న’. అసలు ‘మగధీర’తో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. రాజమౌళి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అయినా కూడా ఈ సినిమా గురించి ఎవరు ఎంత నెగిటివ్‌గా మాట్లాడినా.. రాజమౌళి మాత్రం అప్పుడే కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్‌ను హీరోగా పెట్టి ‘మర్యాదరామన్న’ తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పలు ఇతర భాషల్లో కూడా ఈ మూవీ రీమేక్ అయ్యింది. రీమేక్ అయిన ప్రతీ భాషలో హిట్ టాక్ అందుకుంది. అందులో హిందీ కూడా ఒకటి. 


11 ఏళ్ల తర్వాతే..


తెలుగులోని ‘మర్యాదరామన్న’.. హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్’గా విడుదలయ్యింది. తెలుగులో ఈ సినిమా 2010లో విడుదల కాగా.. హిందీలో 2012లో విడుదలయ్యి సూపర్‌హిట్‌ను సాధించింది. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, జూహీ చావ్లా.. ఇందులో లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ విడుదలయ్యి ఇప్పటికే దాదాపు 11 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత ‘సన్ ఆఫ్ సర్దార్’కు సీక్వెల్ ప్లాన్ చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుంది. అంతే కాకుండా ఫస్ట్ పార్ట్‌లో లీడ్ రోల్స్ చేసిన నలుగురు నటీనటులే.. సీక్వెల్‌లో కూడా నటించనున్నారని సమాచారం. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా పెయిర్‌కు చాలా పాపులారిటీ ఉంది. కానీ వీరిద్దరు కలిసి స్క్రీన్‌పై కనిపించి చాాలాకాలం అవుతోంది. కనీసం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’తో అయినా వారి ఫ్యాన్స్ కోరిక తీరుతుందని అనుకుంటున్నారు.


రెండు సీక్వెల్స్‌తో అజయ్ సిద్ధం


ప్రస్తుతం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఇంకా స్క్రిప్టింగ్ దశలోనే ఉంది. వచ్చే ఏడాది మేలో మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్‌లో ఈ సీక్వెల్‌కు సంబంధించిన ముఖ్య సమాచారం బయటికి వస్తుందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ అంటే కేవలం సౌత్ సినిమాలను రీమేక్ చేసే ఇండస్ట్రీ మాత్రమే అని నెగిటివ్ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు రీమేక్స్‌ను పక్కన పెట్టి సీక్వెల్స్ వెంట పరిగెడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పటికే అజయ్ దేవగన్.. తన హిట్ మూవీ ‘రెయిడ్’కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాడు. దాంతో పాటు ఇప్పుడు ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కూడా తన ఖాతాలో చేరింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం తమ హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: నటుడు విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు, సెన్సార్ బోర్డు అధికారులు సహా పలువురిపై నేరాభియోగాలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial