8 Vasantalu Movie: మను దర్శకుడితో మైత్రి ప్రేమ సినిమా - ఆసక్తి రేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్

Manu director Phanindra Narsetti new movie: మను దర్శకుడు ఫణీంద్ర కొత్త సినిమా అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఆ సినిమా టైటిల్ ఏమిటో చూడండి...

Continues below advertisement

Mythri Movie Makers announces new film: తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. అగ్ర హీరోలు, దర్శకులతో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి అతి తక్కువ కాలంలో ప్రేక్షకుల్లో తమకంటూ మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి. ఒక వైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్... మరో వైపు కంటెంట్ రిచ్ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. లవర్స్ డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... 

Continues below advertisement

'మను' దర్శకుడితో మైత్రి కొత్త సినిమా
లెజెండరీ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, తెలుగమ్మాయి చాందిని చౌదరి జంటగా ఆరేళ్ళ క్రితం వచ్చిన సినిమా 'మను'. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు పురస్కారాలు సొంతం చేసుకుంది. ఆ సినిమా దర్శకుడు ఫణింద్రతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా '8 వసంతాలు'. 

'365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. అదే అనుభవాలతో కొలిస్తే... ఒక వసంతం' అంటూ '8 వసంతాలు' కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎనిమిదేళ్లలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ అని చెప్పారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు.

Also Read: 'జస్ట్ ఎ మినిట్' అంటోన్న 'ఏడు చేపల కథ' హీరో - లవర్స్ డేకి కొత్త పాటతో...

న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా!
న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా '8 వసంతాలు' సినిమాను తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది. అమ్మాయి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు కథలో ఉంటాయట. ఎర్ర గులాబీతో కూడిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Also Readతెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కల్ట్ లవ్ స్టోరీలు ఇవే - ప్రేమికులు తప్పక చూడాల్సిన చిత్రాలు

Continues below advertisement