Manoj Bharathiraja: తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట తీవ్ర విషాదం... కుమారుడు మనోజ్ హఠాన్మరణం
ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా కుమారుడు, దర్శక నటుడిగా తమిళ చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు.

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీ రాజా (Bharathiraja son demise) మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులు. దర్శకత్వం వహించిన సినిమాలతో మాత్రమే కాదు... నటుడిగాను తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇంట ఇవాళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారతీ రాజా కుమారుడు హఠాన్మరణం చెందారు.
గుండెపోటుతో మనోజ్ భారతి రాజా మృతి
Manoj Bharathiraja Passed Away: భారతీ రాజా కుమారుడు పేరు మనోజ్ కే భారతి రాజా. ఆయన తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు. 'తాజ్ మహల్' (1999) సినిమాతో కథానాయకుడిగా తమిళ చిత్రసీమకు పరిచయం అయ్యారు ఆ తరువాత నటుడిగా పలు సినిమాలు చేశారు. రెండేళ్ల క్రితం దర్శకుడుగా మారారు. ఓ సినిమా చేశారు. ఇవాళ సాయంత్రం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
మనోజ్ కే భారతీ రాజా (Manoj K Bharathiraja) కొన్ని రోజులుగా ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇంటిలో విశ్రాంతి పొందుతున్నారు. అయితే మంగళవారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో కన్నుమూశారు మనోజ్ భారతి రాజా.
మనోజ్ భారతీరాజాకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద కుమార్తె దర్శకత్వ శాఖలో పని చేస్తోందట. చిన్న అమ్మాయి విదేశాల్లో చదువుతున్నట్టు తెలిసింది. బుధవారం ఉదయం చెన్నైలో అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారట. భారతీ రాజాను పరామర్శించడానికి ఆయన ఇంటికి పలువురు ప్రముఖులు క్యూ కడుతున్నారు.
Also Read: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
భారతీ రాజా కుటుంబానికి తమిళ చిత్ర సీమలో అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన పట్ల ఎంతో మందికి గౌరవం మాత్రమే కాదు, అభిమానం కూడా ఉంది. చిన్న వయసులో కుమారుడని కోల్పోయిన భారతీ రాజాను చూసి ఆయన కుటుంబ సభ్యులతో పాటు తమిళ చిత్రసీమ ప్రముఖులు, బంధు మిత్రులు బోరున విలపిస్తున్నారు. భారతీ రాజా కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
'తాజ్ మహల్' సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన మనోజ్ కే భారతీ రాజా ఆ తర్వాత 'సముద్రం', 'కాదల్ పొక్కల్', 'అల్లి అర్జున', 'పల్లవన్', 'మహా నడిగాన్', 'బేబీ; తదితర సినిమాల్లో చేశారు. నటుడిగా అతడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. శింబు, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'మానాడు' సినిమాలో మనోజ్ కే భారతీ రాజా ఒక ప్రధాన పాత్ర పోషించారు. కార్తీ, అదితి శంకర్ జంటగా నటించిన 'విరుమాన్' సినిమాలోని ఆయన హీరో సోదరుడిగా ఒక కీలక పాత్ర పోషించారు. నటుడిగా అదే ఆయన చివరి. అది 2022లో విడుదల కాగా... 2024లో Margazhi Thingal చిత్రానికి దర్శకత్వం వహించారు.
Also Read: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార... ఆ కండిషన్స్ దెబ్బకు 30 కోట్లు లాస్!?