Manisharma Shocking Comments On Pawan Kalyan, Mahesh Babu : టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందిన మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో పాటూ ఈతరం అగ్ర హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు. ఇండ్రస్ట్రీ లో దాదాపు 2 దశాబ్దాలకు పైగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కానీ తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, థమన్ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యాక మణిశర్మకి సినిమా అవకాశాలు తగ్గాయి. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మణిశర్మ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.


మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు అందరూ మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మణిశర్మ అన్నారు. మణిశర్మ మహేష్ బాబుకి ఒక్కడు, మురారి, పోకిరి, ఖలేజా వంటి సినిమాలకు సంగీతం అందించారు. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అటు పవన్ కళ్యాణ్ కి ఖుషి, గుడుంబా శంకర్ లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు హీరోలు మణిశర్మతో సినిమాలు చేయడం లేదు. దీనికి కారణం ఏంటని అడిగితే, మహేష్ బాబుతో  చివరి సినిమా వరకు పూర్తి నిబద్ధతతో పని చేశానని, అయితే తర్వాత ఏం జరిగిందో తనపై ఏమి ఎక్కించారో తెలియదని అన్నారు.


ఫ్యూచర్ లో మహేష్ బాబుతో ఏమైనా సినిమాలు చేస్తారా? అని అడిగితే అతడు కనీసం రెండు పెగ్గులు తాగడానికి కూడా పిలవడం లేదని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఆయనతో మంచి బాండింగ్ ఉండేదని అన్నారు. ఈ క్రమంలోనే పవన్ కెరియర్ లో మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన ఖుషి, గుడుంబా శంకర్ సినిమాలకు మ్యూజిక్ ఎలా చేశారో కూడా వివరించారు. ఖుషిలో చెలియా చెలియా పాటను తాను పవన్ కళ్యాణ్ తో కలిసి కూర్చుని మ్యూజిక్ కంపోజ్ చేశానని, అలాగే గుడుంబా శంకర్ సినిమాలో అన్ని పాటలను ఇద్దరం కలిసి చేశామని తెలిపారు.


మహేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు అందరికీ అవకాశాలు ఇవ్వాలని కోరిన ఆయన దేవిశ్రీప్రసాద్ కి ఒకటి.. థమన్ కి ఒకటి.. అలాగే తనకు ఒకటి.. ఇలా ఇస్తే ప్రేక్షకులకు డిఫరెంట్ మ్యూజిక్ అందుతుందని మణిశర్మ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో మహేష్, పవన్ లపై మణిశర్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని ఇచ్చిన మణిశర్మ ఇపుడు ఇలాంటి పరిస్థితిలో ఉండడం తన అభిమానుల్ని సైతం బాధిస్తుంది. మరి రానున్న రోజుల్లో అయినా అగ్ర హీరోలు మణిశర్మకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.


Also Read : చిన్నోడు vs పెద్దోడు - ‘గుంటూరు కారం’తో ‘సైంధవ్’ పోటీపై స్పందించిన వెంకటేశ్