Manchu Vishnu About Prabhas Role In Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ రోల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రభాస్ ఎంతసేపు కనిపిస్తారంటే?
'కన్నప్ప' మూవీ మొత్తం రన్ టైం 3 గంటల 10 నిమిషాలని విష్ణు తెలిపారు. 'ప్రభాస్‌ను మొదటి గెస్ట్ రోల్ కోసం తీసుకున్నాం. ఆ తర్వాత 30 నిమిషాలు పెంచాం. 'కన్నప్ప'లో చివరి 50 నిమిషాలు ఆయన్ను చూస్తారు. మోహన్ బాబు, ప్రభాస్ మధ్య సీన్స్ అద్భుతంగా ఉంటాయి. మోహన్ లాల్ రోల్ 15 నిమిషాలు, శివుడిగా అక్షయ్ కుమార్ 10 నిమిషాలు స్క్రీన్‌పై కనిపిస్తారు. ఇప్పటివరకూ నా కెరీర్‌లో ఇంత భారీ సినిమా చేయలేదు.' అని చెప్పారు.
వాళ్లు ఓకే అంటేనే..
'కన్నప్ప' మూవీ వీఎఫ్‌ఎక్స్ విషయంలో తాను చాలా భయపడ్డానని విష్ణు తెలిపారు. 'మూవీ ట్రైలర్ విడుదలైనప్పుడే అందులో కొన్ని తప్పులున్నాయని నాకు కొంతమంది మెసేజ్ చేశారు. వాళ్లను పిలిచి మాట్లాడి.. వీఎఫ్ఎక్స్ బాధ్యతలు వారికి అప్పగించాను. వాళ్లు ఓకే అంటేనే ఇప్పుడు ఫైనల్ అవుట్‌పుట్ బయటకు వస్తుంది. టీజర్, ట్రైలర్లలో చిన్న తప్పులు కనిపెట్టిన వారిని కూడా నేను అభినందించాను. అందుకే వారికి బాధ్యతలిచ్చాను.' అని అన్నారు.
Also Read: అందరూ నిన్ను మోసం చేశారు.. నేను మాత్రం.. - ఇంట్రెస్టింగ్‌గా అడివి శేష్ 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్
వారిపై బుక్ రాయిస్తున్నా..
తెలుగు సినిమా చరిత్రపై బుక్ రాయిస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. 'అన్నింటి కంటే ముందు ఇండస్ట్రీలో నటీనటుల గురించి రాయాలి. మరో 25 ఏళ్ల తర్వాత ఎస్వీ రంగారావు ఎవరనే ప్రశ్న ఎవరూ వేయకూడదు. ఇండస్ట్రీలో ఈ రోజు చిత్తూరు నాగయ్య ఎవరంటే తెలియకపోవచ్చు. అందుకే అందరిపైనా ఓ బుక్ రాయిస్తున్నా.
సినిమా భారీ స్థాయిలో తెరకెక్కడానికి ప్రభాస్ ప్రధాన కారణం. ఇందులో రుద్రుడి రోల్ గురించి చెప్పగానే వెంటనే అంగీకరించారు. క్లైమాక్స్‌లో కథ స్పీడ్ పెంచేందుకు ఫైనల్ ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్ కట్ చేశాం. 'కన్నప్ప' పెద్ద హిట్ అవుతుందని ప్రభాస్ ప్రతీసారి చెబుతూనే ఉన్నారు. గతంలోనూ నా సినిమాల రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు చేయమంటావా అని అడిగారు. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను' అని అన్నారు.
ఈ నెల 28న కొత్త సాంగ్
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, లుక్స్ ఆకట్టుకోగా.. మరో కొత్త పాటను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. 'శ్రీకాళ హస్తి' పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఆలపించారని తెలిపింది. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు.
ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు నిర్మిస్తున్నారు.సినిమాలో పరమశివుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. పార్వతిగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్ నటించారు. మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.