రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ సభ్యులతో ఆయన  కొన్ని ఒడిదుడుకులు కొన్ని ఎదుర్కొంటున్నప్పటికీ... సినిమాల పరంగా జోరు చూపిస్తున్నారు. మనోజ్ ఒక హీరోగా నటించిన 'భైరవం' మే 30వ తేదీన విడుదలకు సిద్ధం అయ్యింది. ఇది కాకుండా ఆయన చేతిలో మరొక మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక సినిమా టైటిల్ ఇవాళ అనౌన్స్ చేశారు.

రక్షకుడిగా మంచు మనోజ్...మహిళలపై లైంగిక వేధింపులే‌ కథ?Manchu Manoj's Rakshak Movie Updates: మంచు మనోజ్ కథానాయకుడిగా శ్రీనిధి క్రియేషన్స్ సంస్థ ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి నవీన్ కొల్లి రచయిత దర్శకుడు. హీరో పుట్టిన రోజు (Manchu Manoj Birthday) సందర్భంగా... ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ రోజు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే చిత్రానికి 'రక్షక్' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు‌.

Also Read: మ్యాన్ ఆఫ్ మాసెస్ కిల్లర్ లుక్స్... ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ ఫేస్ ఆఫ్... బికినిలో కియారా అడ్వాణీ గ్లామర్... పంచభూతాల కాన్సెప్ట్ ఫైట్స్ - 'వార్ 2' టీజర్‌లో వీటిని గమనించారా?

'రక్షక్' కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... The hidden truth is never hidden forever అని ఒక క్యాప్షన్ రాశారు. కొన్ని నిజాలను ఎవరికీ తెలియకుండా దాచేయాలని ప్రయత్నించినప్పటికీ దాగి ఉండవు అని అర్థం వస్తుంది. ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. నేరం చేసిన కొందరు అది బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో వెలికి తీయడాన్ని కథగా ఊహించవచ్చు. పోస్టర్‌లో మంచు మనోజ్ హైలైట్ అవుతున్నప్పటికీ... అందులో అమ్మాయిలు సైతం ఉన్నారు. ముఖ్యంగా మనోజ్ నుదుట మీద గమనిస్తే ఒక అమ్మాయి చేతిని మరొకరు నొక్కి పట్టుకున్నట్టు ఉంది. అత్యాచారం, మన సమాజంలో మహిళల మీద జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారని అనుకోవచ్చు.

Also Readఅప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు

Manchu Manoj Upcoming Movies: 'భైరవం', 'రక్షక్' కాకుండా మనో చేతులు మరొక రెండు సినిమాలు ఉన్నాయి. తేజా సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'మిరాయ్' సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బర్త్ డే విషెస్ చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేసింది. అలాగే, 'అత్తరు సాయిబు' పేరుతో మరొక సినిమా కూడా చేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే ఆ చిత్రానికి సంబంధించి ఇవాళ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.