Manchu Manoj About His New Journey : రీసెంట్‌గా 'భైరవం', 'మిరాయ్' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన తన నెక్స్ట్ మూవీస్‌పై కాన్సన్‌‌ట్రేట్ చేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మనోజ్... తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు ఇటీవలే వెల్లడించిన ఆయన... తాజాగా దానికి సంబంధించి అప్డేట్ షేర్ చేశారు.

Continues below advertisement

యంగ్ టాలెంట్... ఎంకరేజ్మెంట్

'మోహన రాగ మ్యూజిక్' పేరుతో ఓ సరికొత్త సంగీత సంస్థను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు మనోజ్. మ్యూజిక్ అంటే తనకు ఎంతో ఇష్టమని... ఈ సంస్థ ద్వారా న్యూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. 'లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. 'మ్యూజిక్ ఎల్లప్పుడూ నా ఎస్కేప్. నా ఎక్స్‌ప్రెషన్, నా నిజం. ఈ రోజు ఆ జర్నీ డెవలప్ అవుతోంది. నా కొత్త ప్రపంచ మ్యూజిక్ వెంచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మోహన రాగ మ్యూజిక్... యంగ్ టాలెంట్, కరేజ్, నిర్భయమైన సృజనాత్మక కోసం నిర్మించాం.' అని అన్నారు.

Continues below advertisement

Also Read : రీల్స్... ఫీల్స్... 'రెబల్ సాబ్' యూట్యూబ్ షేక్స్! - ప్రభాస్ 'ది రాజా సాబ్' సాంగ్‌పై తమన్ ఎలివేషన్

సిల్వర్ స్క్రీన్‌పై తనదైన నటన, డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు మనోజ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి... పోటుగాడు, బిందాస్, కరెంట్ తీగ వంటి మాస్ ఎంటర్టైనర్ మూవీస్‌తో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం యాక్టింగ్‌తోనే కాకుండా స్టంట్స్ కంపోజింగ్, సెట్స్ డిజైనింగ్‌లో ఇన్వాల్వ్ కావడం, గుర్తుండిపోయే పాత్రను రూపొందించడంలో ఎప్పటికప్పుడు తన స్పెషాలిటీ చాటుకుంటూ వచ్చారు.

సింగర్... లిరిసిస్ట్‌గానూ...

యాక్టింగ్ మాత్రమే కాకుండా సింగర్, లిరిసిస్ట్‌గానూ తనదైన సత్తా చాటారు మనోజ్. 'పోటుగాడు' మూవీలో 'ప్యార్ మే పడిపోయానే...' పాడి ప్రేక్షకులను మెప్పించారు. 'కొవిడ్ టైంలో అంతా బాగుంటాంరా?' పాటను రిలీజ్ చేశారు. 'మిస్టర్ నూకయ్య' చిత్రంలో 'పిస్తా పిస్తా...' పాటతో పాటు 'నేను మీకు తెలుసా' మూవీలో 'ఎన్నో ఎన్నో...', 'మిస్టర్ నూకయ్య' సినిమాలో 'ప్రాణం పోయే బాధ' పాటలకు సాహిత్యం అందించారు. అలాగే, తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు, అక్క మంచు లక్ష్మి సినిమాలకు సంగీత విభాగంలోనూ వర్క్ చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చు రాజ‌మ‌ణితో క‌లిసి హాలీవుడ్ మూవీ 'బాస్మ‌తి బ్లూస్'కు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లార్స‌న్ ఇందులో ప్ర‌ధాన‌ పాత్ర‌లో నటించారు. 

ప్రస్తుతం స్వయంగా తానే 'మోహన రాగ మ్యూజిక్' పేరుతో సంస్థ ప్రారంభించారు. తండ్రీ కొడుకులిద్దరికీ ఇష్టమైన రాగం 'మోహన రాగ'ను పేరుగా పెట్టడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సంస్థ నుంచి ఫ్యూచర్‌లో ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, సరికొత్త మ్యూజిక్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. 

సినిమాల విషయానికొస్తే... మనోజ్ ప్రస్తుతం 'వాట్ ది ఫిష్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా... వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ టెక్నలాజికల్ ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.