Ram Gopal Varma Reaction On iBOMMA Ravi Case : గత కొద్ది రోజులుగా అటు ఇండస్ట్రీ ఇటు సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్... అదే 'iBOMMA రవి'. ఫుల్ క్వాలిటీ పైరసీ మూవీస్‌తో ఇండస్ట్రీకి కోట్లలో నష్టం తెచ్చి నిర్మాతలకు కంటి మీద కనుకు లేకుండా చేశాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి iBOMMA, BAPPAM సైట్స్ క్లోజ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, నెటిజన్లు మాత్రం రవిని రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారు. తాజాగా... సెన్సేషనల్ డైరెక్టర్ RGV రవి కేసుపై రియాక్ట్ అయ్యాడు.
RGV లాజిక్... నెటిజన్లకు షాక్
iBOMMA రవిని విమర్శిస్తూనే... ఆన్‌లైన్‌లో పైరసీ మూవీస్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు RGV. రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. 'మూవీస్ పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ డెవలప్ కావడం, పోలీసింగ్ చాలా బలహీనంగా ఉండడం వల్ల కాదు. పైరేటెడ్ మూవీస్ చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించేంత వరకూ వారికి సర్వీస్ చేయడానికి ఇలాంటి రవిలు ఎల్లప్పుడూ ఉంటారు. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే రవి సపోర్టర్స్ ఏదో నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆలోచనను ఇన్వెంట్ చేసినట్లుగా అతన్ని రాబిన్ హుడ్‌తో పోల్చడం.
రాబిన్ హుడ్ హీరో కాదు. నేటి నిర్వచనాల ప్రకారం వరల్డ్‌లోనే ఫస్ట్ ఉగ్రవాదిగా అతనిపై ముద్ర పడింది. అతను ఉన్న వారిని దోచుకుని, చంపి లేని వారికి ఇస్తాడు. రిచ్చెస్ట్ పర్సన్స్ చేసే ఏకైక నేరం వారు ధనవంతులు కావడమే. ఆర్థికంగా సక్సెస్ సాధించడం అనేది దొంగతనం, హత్య, శిక్షార్హమైన నేరం అని అనుకోవడం ఎంత నీచమో ఊహించుకోండి.' అంటూ కామెంట్ చేశారు.
Also Read : రీల్స్... ఫీల్స్... 'రెబల్ సాబ్' యూట్యూబ్ షేక్స్! - ప్రభాస్ 'ది రాజా సాబ్' సాంగ్‌పై తమన్ ఎలివేషన్
నిందితుడు సాధువా...
చోరీ చేసిన వస్తువులను తీసుకునే వారు ఫ్రీగా పొందుతున్నారనే కారణంతో నిందితుడిని సాధువుగా చూపించేందుకు టన్నుల కొద్దీ అజ్ఞానం అవసరమని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. 'మూవీ కాస్ట్‌లీ అయితే పైరసీ సపోర్ట్ చేస్తారా?, పాప్ కార్న్ ధర ఎక్కువైతే సినిమా లీక్ చేస్తారా? టికెట్ రేట్స్ ఎక్కువైతే కంటెంట్‌ను దొంగిలించాలా? BMW కాస్ట్ లీ అయితే షోరూం దోచుకుని మురికివాడలో అందరికీ ఉచితంగా కార్లు ఇవ్వాలి. నగలు కాస్ట్ లీ అయితే షాప్ దోచుకుని ఫ్రీగా అందరికీ ఇచ్చేయాలి. అన్నీ వస్తువులకు ఇదే లాజిక్ వర్తిస్తుంది.
ఈ రకమైన ఆలోచన సామాజిక పతనం, అరాచకానికి దారితీస్తుంది. ప్రజలు పైరేటెడ్ కంటెంట్ తమ సౌలభ్యం కోసం చూస్తారు. పైరసీ కొంతమందికి డబ్బు ఆదా చేస్తే కొంతమందికి టైం ఆదా చేస్తుంది. నాతో సహా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా ఇదే కారణంతో పైరసీ కంటెంట్ చూస్తారు. పైరసీ ఆపాలంటే చూసే వాళ్లను కూడా నిందితులుగా పరిగణించాలి. అలాంటి కంటెంట్ చూస్తున్న 100 మందిని అరెస్ట్ చేసి వారి పేర్లు ప్రచారం చేయాలి. ఇక్కడ భయం పనిచేస్తుంది. నైతికత పనిచేయదు.' అంటూ రాసుకొచ్చారు.