Manchu Manoj Emotional About His Family Issues: తన తండ్రి కాళ్లు పట్టుకోవాలని ఉందంటూ మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తమ కుటుంబంలో జరిగిన పరిణామాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి వాడినో అందరికీ తెలుసని.. జీవితంలో ఊహించని ముప్పు ఎదురైందన్నారు.
'నీకేంటి సంబంధం?' అప్పుడొచ్చింది..
9 ఏళ్లుగా తన పని తాను చేసుకుంటున్నానని.. తన భార్య బొమ్మల కంపెనీ ప్రారంభిస్తే దానికి తాను ఆర్ట్ వర్క్ చేసినట్లు మనోజ్ తెలిపారు. 'నేను ఎంతో ఆత్మగౌరవంతో బతికాను. నిస్సహాయ స్థితిలో ఉన్న కారణంగా మీడియా ముందుకొచ్చా. నా వైఫ్ ప్రెగ్నెంట్ సమయంలో మేమంతా మళ్లీ కలిశాం. అది మా కుటుంబంలో ఒకరికి మాత్రం నచ్చలేదు. మరోవైపు.. కాలేజీలో కొన్ని సమస్యల గురించి పెద్దాయన వరకూ వెళ్లడం లేదంటూ స్టూడెంట్స్ లెటర్స్ రాసి నాకు ఇచ్చారు. ఆ టైంలో 'నీకేంటి సంబంధం?' అనే మాట వచ్చింది.' అని చెప్పారు.
Also Read: వచ్చే వారమే ఓటీటీలోకి 'హిట్ 3' - నేచురల్ స్టార్ బిగ్గెస్ట్ వయలెంట్ హిట్ స్ట్రీమింగ్ డేట్ తెలుసా?
నాకూ ఆవేశం ఉంది
కాలేజీలో పని చేసే వారందరితో తనపై, తన భార్యపై కేసులు పెట్టించారని మనోజ్ తెలిపారు. 'సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. తనకు అన్నీ నేనే. నేను తప్పు చేయలేదు. ఒక్క కేసూ పెట్టలేదు. గొడవ పెట్టుకోలేదు. నాకు కూడా ఆవేశం ఉంది. బాధతో వచ్చిన కోపం అది. వెళ్లి నాన్న కాళ్లు పట్టుకోవాలని.. నా పాపను ఆయన ఒడిలో పెట్టుకోవాలని ఇప్పటికీ ఉంది. కానీ.. చేయని తప్పును అంగీకరిస్తే నా పిల్లలకు నేనేం నేర్పుతాను. మా నాన్న నేర్పించిన నీతి అదే. మేమంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. సమస్యలు సృష్టించిన వారే తమ తప్పును తెలుసుకుంటారనే నమ్మకం నాకు ఉంది.' అని పేర్కొన్నారు.
ఈ నెల 30న 'భైరవం'
చాలా రోజుల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ తాజాగా 'భైరవం' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ్‌లో మంచి హిట్ సాధించిన 'గరుడన్' రీమేక్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. సీనియర్ హీరోయిన్ జయసుధ కీలక పాత్రలో నటించగా.. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లైలు హీరోయిన్లుగా నటించారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.
వీరితో పాటు డైరెక్టర్ సందీప్ రాజ్, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తుండగా.. పెన్ స్టూడియోస్ అధినేత డా.జయంతి లాల్ గడా ప్రజెంట్ చేస్తున్నారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.