Nani's HIT 3 OTT Release On Netflix: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ 'హిట్ 3'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'హిట్ 3' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాని సరసన కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. నేచురల్ స్టార్ సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.
రికార్డు కలెక్షన్స్
ఈ మూవీకి రూ.48.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. కేవలం 6 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి క్లీన్ హిట్‌గా నిలిచింది. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ఈ మూవీతో వరుసగా నాలుగో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 'దసరా' మూవీతో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నాని.. 'హిట్ 3'తో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 4 రోజుల్లోనే రూ.101 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించారు. రూ.75 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన టాలీవుడ్ హీరోగా నిలిచారు.
ఫస్ట్ డే రూ.43 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టగా.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డులకెక్కింది. అటు, యూఎస్ మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ అందుకుంది. మహేష్ బాబు తర్వాత యూఎస్‌లో అత్యధికంగా 1 మిలియన్ డాలర్లు సాధించిన తెలుగు హీరోగా నాని ఆ రికార్డు స్థిరంగా ఉంచుకున్నారు.
Also Read: 'అట్లాస్ సైకిల్' వచ్చేస్తోంది - 'అనగనగా' ఫేం కాజల్ చౌదరి కొత్త మూవీ స్టార్ట్
స్టోరీ ఏంటంటే?
ఈ మూవీలో నాని.. రూత్ లెస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన నటనతో మెప్పించారు. వయలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ మూవీకి ఫస్ట్ రెండు రోజులు యూత్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టగా.. ఆ తర్వాత రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం వెళ్లారు. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో (HIT) అర్జున్ సర్కార్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. జమ్మూకశ్మీర్‌లో విధుల్లో ఉన్న టైంలో దారుణంగా ఓ మర్డర్ జరుగుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సేమ్ ప్యాట్రన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 13 హత్యలు జరుగుతాయి. వీటన్నింటికీ ఏదైనా కనెక్షన్ ఉందా అని తెలుసుకునే క్రమంలో డార్క్ వెబ్‌లో జరిగే బిగ్ క్రైమ్ కారణమని తెలుసుకుంటాడు.
ఈ భారీ క్రైమ్‌ను అరికట్టేందుకు ఆ గ్యాంగ్‌లో జాయిన్ కావాలని అనుకుంటాడు. అందుకు అర్జున్ సర్కార్ ఏం చేశాడు? అసలు మృదుల (శ్రీనిధి శెట్టి) ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఎలా భాగం అవుతుంది. డార్క్ వెబ్‌ను వెనుక ఉన్న అసలు విలన్ ఎవరు? దీన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు? అతను చేసిన స్పెషల్ ఆపరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.