మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు వున్నాయని మరొక్కసారి తేటతెల్లం అయ్యిందని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి. లెజెండరీ యాక్టర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచు కొడుకుల మధ్య సఖ్యత లేదని ఆ ఒక్క లేఖతో స్పష్టం అయ్యిందని ఇండస్ట్రీ జనాలు, అలాగే ఆడియన్స్ అనుకుంటున్నారు. ఆ మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు మళ్ళీ తెరపైకి రావడానికి కారణం మంచు మనోజ్. కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళితే...


మాట వరుసకైనా అన్నయ్య పేరెత్తని తమ్ముడు
Manchu Manoj Daughter Name: మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి దంపతులకు పాప పుట్టింది. ఆ చిన్నారికి 'దేవసేన శోభా' (Devasena Shobha MM) అని నామకరణం చేశారు. దేవసేన అంటే 'బాహుబలి'లో అనుష్క పేరు అనుకునేరు. ఆ పరమ శివుని కుమారుడు సుబ్రమణ్య స్వామి భార్య పేరు దేవసేన. శివుని మీద భక్తితో ఆ దేవుని కోడలి పేరు తన చిట్టి తల్లికి పెట్టారు. అత్తగారు, దివంగత రాజకీయ నాయకురాలు శోభా నాగిరెడ్డి నుంచి శోభా పేరు తీసుకున్నారు.


అమ్మాయికి నామకరణం చేసిన విషయాన్ని ఈ రోజు (జూలై 8న) మంచు మనోజ్ చెప్పారు. సోషల్ మీడియాలో పాపకు ఆ పేరే ఎందుకు పెట్టామనేది వివరిస్తూ ఒక లెటర్ షేర్ చేశారు. తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మలా దేవితో పాటు అక్క లక్ష్మీ మంచు పేరు అందులో ప్రస్తావించారు. భార్య మౌనికా రెడ్డి తోబుట్టువుల పేర్లు కూడా ప్రస్తావించారు. వదిన, బావమరిదిని సైతం గుర్తు పెట్టుకుని లేఖలో చోటు కల్పించారు. కానీ, అన్నయ్య విష్ణు మంచు (Vishnu Manchu) పేరు ఆ లేఖలో ఎక్కడా లేదు. కనీసం మాట వరుసకు అయినా సరే విష్ణు పేరు ప్రస్తావించలేదు మనోజ్.


తన పాపకు పేరు పెట్టిన విషయాన్ని చెప్పే లేఖలో కావాలని అన్నయ్య విష్ణు పేరును తమ్ముడు వదిలేసి వుంటాడని ఇండస్ట్రీ గుసగుస. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో బ్రదర్స్ మధ్య జరిగిన ఒక గొడవ తెలుగు సినిమా ప్రేక్షకులకు, నెటిజనులు గుర్తు వుండే వుంటుంది.



మంచు బ్రదర్స్ విబేధాలు చల్లారలేదా?
గత ఏడాది మార్చిలో అనుకుంట... మనోజ్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు. కాసేపటికి అది డిలీట్ చేసినా సరే... అందులో ఏముందో జనాలు అంతా చూశారు. తమ సహాయకుడు సారథి ఇంటికి వచ్చి విష్ణు దాడి చేసిన విజువల్స్ వైరల్ అయ్యాయి. ''ఇదిగో ఇంట్లోకి వచ్చి మా వాళ్ళను కొడుతూ  వుంటాడు'' అని ఆ వీడియోలో మనోజ్ వాయిస్ కూడా వైరల్ అయ్యింది.


Also Readప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?






విష్ణు, మనోజ్‌... మంచు అన్నదమ్ముల మధ్య గొడవ ఏమిటనేది తెలియదు కానీ విబేధాలు వున్నట్లు స్పష్టం అయ్యింది. ఆ తర్వాత ఒక సందర్భంలో విష్ణుతో గొడవ గురించి ప్రశ్నించగా... ''నాకంటే మీడియాకి ఎక్కువ తెలుసు'' అంటూ వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చాడు. మంచు ఇంట్లో గొడవ సద్దుమణిగి వుంటుందని అనుకోగా... ఇప్పుడు విష్ణు పేరు ఎత్తకుండా మనోజ్ లేఖ రిలీజ్ చెయ్యడంతో ఆ గొడవలు ఇంకా చల్లారలేదని అనుకోవాలని టాలీవుడ్ జనాలు ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Readపవన్‌ కళ్యాణ్‌ను ఏపీ సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య