సినీ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో సింపుల్ గా వీరి వివాహ వేడుక జరిగింది. అయితే,  వీరిద్దరి పరిచయం మొదలుకొని, ప్రేమ, పెళ్లి వరకు ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కొత్త జంట వెన్నెల కిశోర్ హోస్ట్ గా చేస్తున్న ‘అలా మొదలైంది’ షోలో పాల్గొంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో మనోజ్, మౌనిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   


మనోజ్ కంటే మౌనికకే కోపం ఎక్కువా?


ముందుగా ఈ ప్రోమో ఫన్నీ ఫన్నీగా కొనసాగింది. మంచు మనోజ్ తన సతీమణి మౌనికతో షోలో అడుగు పెట్టగానే, వెన్నెల కిశోర్ మనోజ్ ను హగ్ చేసుకుని డ్యాన్స్ చేస్తారు. ఈ పాట మాకోసం వేశారు అనుకున్నాం. మీకోసం వేశారా? అని మౌనిక అనడంతో షోలో నవ్వులు విరబూశాయి. వెన్నెల కిశోర్ అడిగిన ప్రశ్నలకు మనోజ్ దంపతులు చక్కగా సమాధానం చెప్పారు. మౌనికతో పరిచయం గురించి చెప్పడంతో పాటు, ఆమెతో రొమాంటిక్ సంభాషనల్లో తానే ముందున్నాని మనోజ్ చెప్పారు. చాలా మంది మనోజ్ కు చాలా కోపం ఉందని భావిస్తారు. కానీ, ఆయన కంటే తనకే ఎక్కువ కోపం ఉందని చెప్పకనే చెప్పుకొచ్చింది. మనోజ్ కోపాన్ని ఎలా డీల్ చేస్తానో అనుకున్నారు. కానీ, నా కోపాన్ని మనోజ్ ఎలా డీల్ చేస్తారో? అంటూ చిరు నవ్వులు చిందించింది.  


నా జీవితంలో ఆరోజు మర్చిపోలేను- మౌనిక


మనోజ్, మౌనిక ప్రేమ ప్రయాణంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నట్లు వారి మాటలను బట్టి చూస్తే అర్థం అవుతుంది. తమ ప్రేమలో ఎన్నో ఎమోషనల్ యాంగిల్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈశ్వర సాంగ్ మాదిరిగానే తమ ప్రేమ కూడా మారిపోయిందన్నారు మనోజ్. అటు తన తల్లి చనిపోయిన తర్వాత బర్త్ డే రోజున ఆకాశం వైపు చూస్తూ ఎంతో బాధపడినట్లు మౌనిక చెప్పింది. నాకేం కావాలో నీకు తెలుసు, అంతా నీపైనే వదిలేస్తున్నా అనుకున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకు రాడనుకున్నానని చెప్పింది. నా జీవితంలో ఆరోజు మర్చిపోలేను అంటూ మౌనిక ఎమోషనల్ అయ్యింది.  


కాదంటే, నేను బతికి ఉండి వేస్ట్- మనోజ్


ప్రేమ విషయంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనట్లు మనోజ్ వివరించారు. ప్రేమ కావాలా? సినిమా కావాలా? ఏదో ఒకటి ఎంచుకో అనే పరిస్థితి కూడా వచ్చిందన్నారు. అయితే, నన్ను నమ్ముకుని ఓ బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్ నిలబడుతుందంటే ఈ జన్మకు ఇదే చాలు అనుకున్నట్లు వివరించారు. కాదంటే, నేను బతికి ఉండి వేస్ట్ అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. వీరి ప్రేమ, పెళ్లి, వీటి మధ్యలో జరిగిన సంఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే!


Read Also: మంజు వారియర్ గొప్ప మనసు, తన కారు వెంట పరిగెత్తిన అభిమాని కోరిక తీర్చిందిలా!