Mana Shankara Varaprasad Garu Second Single Sasirekha Full Song Out Now : పచ్చని ప్రకృతి... బెస్ట్ లవ్ మూమెంట్... నదిలో పడవపై ఓ వైపు నుంచి మన ప్రసాద్... మరోవైపు పడవలో శశిరేఖ. 'శశిరేఖా ఓ మాట చెప్పాలి' అని మన వరప్రసాద్ గారు అంటుంటే... 'మోమాటాల్లేకుండా చెప్పేసెయ్ ఓ ప్రసాదూ' అంటూ శశిరేఖ అంటుంది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో 'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి లవ్ సాంగ్ వచ్చేసింది.
లవ్ సాంగ్ వేరే లెవల్
ప్రోమోతోనే భారీ హైప్ క్రియేట్ చేయగా... ఫుల్ సాంగ్‌తో ఆ హైప్ పదింతలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నయన్‌లు సరికొత్తగా న్యూ లుక్‌లో లవ్ సాంగ్‌లో అదరగొట్టారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ వేరే లెవల్. 'శశిరేఖ ఓ మాట చెప్పాలి.. చెప్పాక ఫీలు కాకా.. ఓ ప్రసాదూ మోమాటల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ పాడారు.
తాను ఓ సాధారణ వ్యక్తిగా ధనవంతురాలైన ఓ అమ్మాయిని ప్రేమిస్తే తన లవ్ ఎక్స్ ప్రెస్ చేసే సందర్భంలో ఈ పాట వచ్చినట్లు తెలుస్తోంది. నయన్, చిరు కూల్ స్టెప్స్ అదిరిపోయాయి. ఫస్ట్ సాంగ్ 'మీసాల పిల్ల' ప్రస్తుతం ట్రెండ్ అవుతుండగా... ఈ పాట కూడా అదిరిపోయింది. ఫస్ట్ సాంగ్‌లో స్టైలిష్ వింటేజ్ మెగాస్టార్ కనిపించగా... కొత్త సాంగ్‌లో లవర్ బాయ్‌లా కనిపించారు.
Also Read : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ వాయిదా - క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్... 'అఖండ 2' రిలీజ్ వాయిదాపై రియాక్షన్
ఈ మూవీలో చిరు, నయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా... విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటే కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.