Nandamuri Kalyan Chakravarthy Re Entry With Champion Movie : దాదాపు 35 ఏళ్ల తర్వాత నందమూరి హీరో మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రాబోతోన్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్' మూవీలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

Continues below advertisement

లుక్ రివీల్

ఈ మూవీలో కీలకమైన రాజి రెడ్డి పాత్రలో కల్యాణ్ చక్రవర్తి కనిపించబోతున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మాస్ సీరియస్ లుక్‌లో ఆయన అదరగొట్టారు. '1980ల్లో తన నటనతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కల్యాణ్ చక్రవర్తి 35 ఏళ్ల తర్వాత మా 'ఛాంపియన్' మూవీతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'లంకేశ్వరుడు' సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిన తర్వాత ఆయన యాక్టింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు రాజి రెడ్డిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు.' అంటూ పేర్కొన్నారు.

Continues below advertisement

Also Read : పవర్ లిఫ్టింగ్‌లో నటి ప్రగతి ప్రతిభ - ఇంటర్నేషనల్ స్థాయిలో 4 మెడల్స్

1980ల్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అత్తగారూ స్వాగతం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కల్యాణ్ చక్రవర్తి. ఆ తర్వాత తలంబ్రాలు, మామా కోడలు సవాల్, ఇంటి దొంగ, మారణ హోమం, అత్తగారు జిందాబాద్, రౌడీ బాబాయ్, జీవన గంగ, ప్రేమ కిరీటం, మేనమామ, లంకేశ్వరుడు, కబీర్ దాస్ మూవీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు బిగ్ గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

క్రిస్మస్ సందర్భంగా...

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే యంగ్ హీరో రోషన్... ఈసారి సరికొత్తగా స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్'తో రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్ అదిరిపోయాయి. బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌గా ఫుట్ బాల్ ప్రధానాంశంగా మూవీ రూపొందింది. 'మైఖేల్ సి విలియమ్స్' పాత్రలో ఫుట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ కనిపించబోతున్నారు. టీజర్ చూస్తుంటే 'లగాన్' సినిమాకు కనెక్ట్ అయ్యేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా... జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించాయి. స్వప్న దత్ నిర్మాత. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'నిర్మలా కాన్వెంట్'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఫస్ట్ మూవీలో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత 'పెళ్లి సందD'లోనూ నటించారు. ఇది అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ డ్రామా మూవీలో నటించారు.