Mana Shankara Varaprasad Garu Second Single Sasirekha Song Promo : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో 'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి మరో సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ లవ్ సాంగ్ ప్రోమోను టీం రిలీజ్ చేసింది.
సరికొత్తగా మెగాస్టార్, నయన్
'శశిరేఖ' అంటూ ముద్దుగా మెగాస్టార్ పిలుస్తుంటే 'ఓ ప్రసాదూ' అంటూ అంతే ముద్దుగా నయన్ రిప్లై ఇవ్వడం క్యూట్‌గా ఉంది. ఈ సాంగ్‌లో మెగాస్టార్, నయన్ సరికొత్తగా కనిపించారు. 'శశిరేఖా... ఓ మాట చెప్పాలి. చెప్పాక ఫీలు కాక... ఓ ప్రసాదూ మోమాటాల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ....' అంటూ సాగే లిరిక్స్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... పూర్తి పాట ఈ నెల 8న రిలీజ్ కానుంది.
Also Read : సంక్రాంతి బరిలో 'అఖండ 2'! - నిర్మాత రామ్ అచంట ట్వీట్‌కు అర్థమేంటి?
ట్రెండింగ్‌లో మీసాల పిల్ల
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన 'మీసాల పిల్ల' సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. కపుల్ మధ్య అలకలు, భార్యను కూల్ చేసేందుకు మన శంకరవరప్రసాద్ గారు చేసిన అల్లరిని చాలా అందంగా చూపించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ కలిసి పాడారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. అటు సోషల్ మీడియాలోనే వేల కొద్దీ రీల్స్ చేస్తున్నారు. దీంతో తాజాగా రిలీజ్ చేయబోయే సాంగ్ 'శశిరేఖ'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. రీసెంట్ ప్రోమోతో ఆ అంచనాలు పదింతలయ్యాయి.
బోట్లపై లవ్ కపుల్ శశిరేఖ, ప్రసాద్ సరికొత్త లుక్‌తో అదరగొట్టారు. 'మీసాల పిల్ల' సాంగ్‌లో వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేసుకోగా... లవ్ సాంగ్ 'శశిరేఖ'లో లవర్ బాయ్‌లా కనిపించారు చిరు. ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నారు
ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు డైరెక్టర్ అనిల్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిరు, నయన్‌లతో పాటు విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే కేథరీన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
డైరెక్టర్ అనిల్‌కు పెద్ద పండుగ బాగా కలిసొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 'మన శంకరవరప్రసాద్ గారు' కూడా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.