మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty)తో తమిళ దర్శకుడు అయినప్పటికీ తెలుగుతో పాటు మలయాళం, ఇతర భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్న గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' (Dominic And The Ladies Purse) టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ కొన్ని రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.‌ న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 


జనవరి 23న థియేటర్లలోకి మమ్ముట్టి సినిమా
Dominic And The Ladies Purse Release Date: 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' సినిమాను జనవరి 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు‌ ఈ రోజు తెలిపారు.‌ రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే మమ్ముట్టి ఒక షట్టర్ ఓపెన్ చేసి కిందకు చూస్తున్నారు. ఆయన ముందు ఒక లేడీస్ పర్స్, ఓల్డ్ నోకియా ఫోన్, బైనాక్యులర్, సిమ్ కార్డు, పెన్ను, భూతద్దం ఉన్నాయి. షట్టర్ వెనుక పిల్లి కూడా కనబడుతుంది. షట్టర్ లోపల ఆ పిల్లి అడుగులు ఉన్నాయి.‌ హీరోకు, వాటికి సంబంధం ఏమిటి? అనేది తెలియాలి అంటే జనవరి 23 వరకు వెయిట్ చేయాలి. తెలుగులో డబ్ చేస్తారా? లేదా? అనేది తెలియాలంటే... ఇంకో రెండు మూడు వారాలు ఆగాలి.






ఈ సినిమాతో గౌతమ్ మీనన్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా?
గౌతమ్ మీనన్ సరైన విజయం అందుకుని పదేళ్లు అవుతుందని చెప్పాలి. అజిత్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన 'ఎన్నై ఆరిందాళ్' (తెలుగులో ఎంతవాడుగాని పేరుతో విడుదల అయింది) మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నాగచైతన్య కథానాయకుడిగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చేశారు. అది ఆశించిన విజయం సాధించలేదు. ధనుష్, శింబు హీరోలుగా చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. విక్రమ్ హీరోగా చేసిన 'ధ్రువ నక్షత్రం' ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. దాంతో ఈ సినిమాతో గౌతమ్ నందన్ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.


Also Readఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!



'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తుండగా... గోకుల్ సురేష్, లీనా, సిద్ధికి, విజయ్ బాబు, విజి వెంకటేష్ ఇతర సహాయ పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు నీరజ రాజన్, సూరజ్ రాజన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్క్రీన్ ప్లే రాశారు. మమ్ముట్టి కంపెనీ పతాకం మీద మమ్ముట్టి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.


Also Read: మళ్లీ తల్లి కాబోతున్న ఇల్లీ బేబీ... న్యూ ఇయర్ వీడియోలో హింట్ ఇచ్చిన హీరోయిన్