Trending
Bhagyashri Borse: సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
Bhagyashri borse as Mahalaxmi: 'RAPO22'నుంచి న్యూ ఇయర్ సర్ప్రైజ్ వచ్చేసింది. 'మన సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి...' అంటూ హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఉస్తాద్ రామ్ పోతినేని కొత్త ఏడాదిని తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసి మొదలు పెట్టారు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లోనే జరిగిందిలెండి. తాజాగా రామ్ హీరోగా నటించిన 'RAPO22'సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.
మన సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'RAPO22'. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో రామ్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ 'సాగర్' పాత్రలో నటిస్తున్నారు. "మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్" అంటూ రీసెంట్ గా రామ్ క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్లో రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్ తో, ముఖంలో అందమైన చిరునవ్వుతో కనిపించడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. రామ్ ఫస్ట్ లుక్ తోనే ఆహ్లాదకరమైన ఫీలింగ్ ని కలిగించారు మేకర్స్.
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి న్యూ ఇయర్స్ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అందులో భాగంగా "మన సాగర్ గాడి లవ్వు... మహాలక్ష్మి" అంటూ హీరో హీరోయిన్ జంటగా ఉన్న పోస్టర్ ను వదిలారు. అందులో భాగ్యశ్రీ చుడిదార్ ధరించి ట్రెడిషనల్ లుక్ లో అందంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె కాలేజీ స్టూడెంట్ గా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక భాగ్యశ్రీ తన చున్నితో ముఖాన్ని తుడుస్తుంటే, రామ్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. 'RAPO22'సినిమా షూటింగ్ విషయానికి వస్తే... రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. హైదరాబాద్లోనే షూటింగ్ మొదలు కాగా, రామ్ తో పాటు సినిమాలోని కీలక పాత్రధారులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీశారు.
ఇద్దరికీ ఈ సినిమా ముఖ్యమే
రామ్ గత కొన్నాళ్లుగా హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా 'డబుల్ ఇస్మార్ట్' అంటూ ప్రేక్షకులను పలకరించిన ఈ హీరోకి నిరాశ తప్పలేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో గేర్ మార్చి తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీల వైపు మళ్ళారు రామ్. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కావడం కేవలం రామ్ కి మాత్రమే కాదు, ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీకి కూడా ముఖ్యమే. ఆమె టాలీవుడ్ లోకి స్టార్ హీరోల సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికి ఇప్పటిదాకా ఒక్క సూపర్ హిట్ కూడా పడలేదు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ కొత్త జంటకి సక్సెస్ దక్కాలని కోరుకుందాం.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?