Mamata Kulakarni : దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
Mamata Kulakarni : దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్ కుంభమేళాలో సన్యాసినిగా మారిపోయారు. గ్లామర్ ఫోజులు, లిప్ లాక్‌లతో యువత గుండెల్ని మెలిపెట్టిన హీరోయిన్ ఇప్పుడు మరో సంచలనంగా సృష్టించారు.

Mamata Kulakarni : మమతా కులకర్ణి.. ఇప్పటి జనరేషన్ కి పేరు అంతగా తెలియదేమో కానీ.. 90s వాళ్లకు నిద్ర లేకుండా చేసిన అందగత్తె. గ్లామర్ పాత్రలతో బాలీవుడ్ లో వరుస హిట్లు కొట్టిన మమతా కులకర్ణి ప్రస్తుతం కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించి " సన్యాసిని" గా మారిపోయింది. "అఖరా" అనేది అఘోరాలు, సన్యాసులకు సంబంధించిన పీఠాల వంటివి. ఒక్కొక్క సన్యాసి ఒక్కొక్క అఖరాకు సంబంధించిన సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. 2015లో ట్రాన్స్ జెండర్లు, సాధ్విలకు సంబంధించి 'కిన్నెర' అఖారాను ప్రారంభించారు Dr. లక్ష్మి నారాయణ త్రిపాఠీ. ప్రస్తుతం ఆయనే ఆ అఖారాకు 'మహా మండలేశ్వర్'గా ఉన్నారు. అంటే ప్రధాన గురువు స్థానం లాంటిది. ఇప్పుడు మమతా కులకర్ణి కూడా సన్యాసం తర్వాత "మహా మండలేశ్వర్ " స్థానాన్ని పొందబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె కొత్త పేరు 'మాయి మమతా నంద గిరి ' గా మారిపోయినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సన్యాసి దుస్తుల్లో కుంభమేళాలో మమతా కులకర్ణి సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమా స్టోరీని మించిన ట్విస్టులు మమతా కులకర్ణి లైఫ్ లో
మహారాష్ట్రలోని మిడిల్ క్లాస్ లో పుట్టిన మమతా కులకర్ణి 1992లో 'తిరంగా ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమా "ఆషిక్ ఆవారా"లో కొత్త హీరో సైఫ్ అలీ ఖాన్ పక్కన హీరోయిన్ గా నటించింది. అక్కడ నుంచి బాలీవుడ్ హిట్ సినిమాల్లో వరుసగా నటిస్తూ దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. అదే సమయం లో టాప్ రేస్ లో ఉన్న దివ్యభారతి చనిపోవడంతో అమె స్థానాన్ని మమత కులకర్ణి భర్తీ చేసింది. 'సబ్ సే బడా కిలాడీ ' బాజీ ' 'కరణ్ అర్జున్ ' క్రాంతి వీర్ ' లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి.
ఒక పక్క సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే మరోపక్క ఆమె మ్యాగజైన్ లకు ఇచ్చిన గ్లామరస్ ఫోటోషూట్లు బాలీవుడ్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అయితే దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి "చైనా గేట్ " (1998) తీస్తున్నప్పుడు ఆయనతో మమతా కులకర్ణి గొడవ పడడం ఆమె కెరీర్ ను దెబ్బతీసింది. ముంబై మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ మమతపై పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అక్కడి నుంచి ఆమె డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మమతా కులకర్ణికి దక్కాల్సిన పలు సినిమాలు 'ఊర్మిళ ' చేతుల్లోకి వెళ్లిపోయాయి. బాలీవుడ్‌లో మమతా కులకర్ణి నటించిన చివరి సినిమా 2002లో వచ్చిన "కభీ తుమ్ కభీ హమ్ ".
Also Read: ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా? ఇంకా లిస్ట్‌లో ఎవరెవరున్నారు?
తెలుగులో మోహన్ బాబు పక్కన హీరోయిన్ గా
మోహన్ బాబు హీరోగా వరుస హిట్లు కొడుతున్న సమయంలో 1992లో వచ్చిన "దొంగ పోలీస్ " మూవీలో మమతా కులకర్ణి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సినిమా యావరేజ్ గా ఆడినా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అదే ఏడాది హీరో ప్రశాంత్ కు జంటగా "ప్రేమ శిఖరం " సినిమాలోనూ మమతా హీరోయిన్గా నటించింది.
2016-డ్రగ్ కేసులో
2002 తర్వాత సడన్ గా మాయమైన మమత పేరు మళ్ళీ 2016 లో వినిపించింది. 2వేల కోట్లకు సంబంధించిన కెన్యా డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో మమతా కులకర్ణితో పాటు ఆమె ప్రియుడు /భర్తగా ప్రచారంలో ఉన్న విక్కీ గోస్వామి పేర్లు ఉన్నట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచార నడిచింది. పోలీసులు ముంబైలోని మమత కులకర్ణి ఇంటికి వెళ్లి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. ఆ తర్వాత మమతా కులకర్ణి పేరు గత ఏడాది వినిపించింది. ఇండియా తిరిగివచ్చిన ఆమె " బాలీవుడ్లో నటించాలని తనకు ఏమీ లేదని " స్పష్టం చేసారు. అన్నట్టుగానే కుంభమేళాకు అటెండ్ అయి సన్యాసినిగా మారి మరో సంచలనం సృష్టించారు. ఇలా ఒకప్పుడు దేశాన్ని ఉపేసిన "మమతా కులకర్ణి " లైఫ్ మొత్తం బోలెడన్ని ట్విస్ట్ లతో నిండిపోయి ఉండడం విశేషం.