Jaat Release Date: బాలీవుడ్ హీరో సన్నీతో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ‘జాట్’ రిలీజ్ డేట్ ఫిక్స్... గట్టి పోటీ తప్పదా?

బాలీవుడ్ హీరో సన్నీడియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం జాట్. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.

Continues below advertisement

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘జాట్’ (Jaat Movie). అసలీ కాంబినేషనే ఊహించనిది. అందులో బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్న చిత్రం కావడంతో.. నార్మల్‌గానే సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. టైటిల్, ఫస్ట్ లుక్ వంటివి విడుదలైన తర్వాత.. సినిమాపై విపరీతమైన ఆసక్తి ఏర్పడగా.. ఆ తర్వాత వచ్చిన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అని ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. శుక్రవారం మేకర్స్ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించారు. 

Continues below advertisement

వాస్తవానికి బాలీవుడ్ పరిస్థితేం ప్రస్తుతం బాగోలేదు. సంవత్సరానికి రెండు మూడు హిట్ సినిమాలు రావడం కూడా గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ స్టార్స్ అందరూ సౌత్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు. వారు కథ చెబితే మారు మాట్లాడకుండా ఓకే చేస్తున్నారు. షారుఖ్, సల్మాన్, రణబీర్ వంటి వారు టాలీవుడ్ డైరెక్టర్స్‌ని నమ్ముకునే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి సన్నీ డియోల్ కూడా చేరారు. మాములుగా అయితే సన్నీ డియోల్ సినిమా చేస్తున్నాడంటే అందులో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందనేలా పేరు ఉంది. అలాంటిది టాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడంటే.. అందులో మ్యాటర్ లేకుండా ఉంటుందా? అదీ కాక విడుదలైన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే.. సన్నీ డియోల్‌ని ఇప్పటి వరకు బాలీవుడ్ చూపించని కోణంలో గోపీచంద్ ప్రజెంట్ చేయబోతున్నారనేది స్పష్టమవుతోంది. అందుకే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండి వార్తలలో ఉంటూనే ఉంది. 

Read also: 'స్కై ఫోర్స్' రివ్యూ: దేశభక్తి సినిమా అక్షయ్‌ కుమార్‌కు హిట్ ఇచ్చిందా? లేదంటే ఇదీ ఫ్లాపుల పరంపరలో చేరుతుందా?

Jaat Release Date: ఇక ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌ నిజంగా మాస్ ట్రీట్ అనేలా ఉంది. భారీ మెషిన్ గన్ పట్టుకుని హీరోయిక్‌గా సన్నీ డియోల్ నడిచి వస్తుంటే.. వెనుక హెలీకాప్టర్, గాల్లో మనీ.. చూస్తుంటేనే వావ్ అనేలా ఉందీ పోస్టర్. అయితే ఏప్రిల్ 10 అనగానే.. కచ్చితంగా ఓ విషయం గుర్తుకు వస్తుంది. నార్త్ వాళ్లకి ఏమోగానీ, సౌత్ వాళ్లకి మాత్రం సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న ‘జాక్’, అజిత్ చేస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు సేమ్ అదే తేదీన విడుదలయ్యేందుకు ఖర్చీఫ్ వేసుకుని మరీ రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ‘జాట్’కు తీవ్ర పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే, మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది కాబట్టి.. థియేటర్ల కొరత అయితే ఉండకపోవచ్చు. వాళ్ల ప్లానింగ్ వేరే ఉంటుంది కాబట్టి.. ‘జాట్’కి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణదీప్ హుడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మిస్సైల్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు ఎక్కువ మంది టాలీవుడ్ వాళ్లే సాంకేతిక నిపుణులుగా పనిచేస్తుండటం. నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విడుదల తేదీ ప్రకటనతో ఈ మూవీ టాప్‌లో డ్రెండ్ అవుతోంది.

Also Read'హిసాబ్ బారాబర్' రివ్యూ: 27 రూపాయల నుంచి 2000 కోట్ల స్కామ్ వరకు - Zee5లో మాధవన్ ఫైనాన్షియల్ థ్రిల్లర్

Continues below advertisement