Premalu Telugu Trailer: మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం ‘ప్రేమలు’. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. సుమారు రూ.3 కోట్ల బడ్జెట్‍ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది. గత నెల ఫిబ్రవరి 9న విడుదలైన సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఇంతగా రెస్పాన్స్‌ అందుకున్న ప్రేమలు తెలుగు రైట్స్ కోసం చాలా హ‌డావుడి జ‌రిగింది. చివ‌రికి రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ తెలుగు రైట్స్‌ని ద‌క్కించుకొని ఈనెల 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసిన టీం నేడు తెలుగు ట్రైలర్‌ను (Premalu Telugu Trailer) చేశారు.


ట్రైలర్ ఎలా ఉందంటే..


ఈ సందర్భంగా  హైదరాబాద్‌లోని విజేత్ కాలేజీలో ఈరోజు ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించి సాయంత్రం 7 గంటలకి విడుదల చేశారు.  మలయాళంనే ట్రైలర్‌నే కాపీ కట్‌ పెస్ట్‌గా రిలీజ్‌ చేసిన ఇందులో తెలుగు డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో ఈమధ్య సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయినా కుమారీ ఆంటీ ప్రస్తావరావడం ట్రైలర్‌గా హైలెట్‌ అని చెప్పాలి. లవ్‌ అండ్ కామెడీతోగా ట్రైలర్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది.  హీరో రైలు వెనకాల పరుగు తీస్తున్న సీన్‌తో ట్రైలర్‌ మొదలైంది. రైలులో ప్రయాణం చేస్తూ పడుకుని ఉన్న హీరోయిన్‌ దగ్గరికి వచ్చిన నిజం చెప్పాలంటే నిన్ను పెళ్లిలో చూసినప్పుడే నీకు పడిపోయా అని చెప్పడం ఆకట్టుకుంది.



హీరోయిన్‌తో పిచ్చి ప్రేమలో మునిగిపోయిన హీరోతో అతడి ఫ్రెండ్‌ ప్రేమ మనిషిని గుడ్డివాడిని మాత్రమే కాదు మెంటలోన్ని కూడా చేస్తుందంటాడు. ఫ్రెండ్స్‌ జోన్‌ అనేది కుమారి ఆంటీ లాంటిదిరా.. పబ్లిసిటీ.. పైసలు ఉంటాయి కానీ, ప్రశాంత ఉండదు అనే డైలాగ్‌ పెట్టడం కోసమెరుపు. వయసులో పెద్దవాడు, తెలివైన వాడు, వెల్‌ సెటిల్‌ అయినవాడు కావాలని హీరోయిన్‌ ఫ్రెండ్‌ చెప్పడం.. అతడితో హీరోయిన్‌ క్లోజ్‌ మూవ్‌ అవ్వడం మూవీపై అంచనాలు పెంచేస్తుంది. ఇక చివరిలో అమీర్‌పేట్‌లో అన్ని కోచింగ్స్‌‌ ఇస్తారు.. అమ్మాయిలను ఎలా పడేయాలో కూడా నేర్పిస్తే బాగుండు అనే డైలాగ్‌ యూత్‌ చేత ఈళలు వెయించడం పక్కా. మొత్తానికి ఈ మూవీ మార్చి 8న యూత్‌ను అలరించడం పక్కా అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 


Also Read: 


ఇక ‘ప్రేమలు’ సినిమాలో  నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. నెల్సన్, మమితా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‍ లో కొనసాగుతుంది. తెలుగు వెర్షన్ మూవీకి ఈ పాయింట్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 8న ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహద్ ఫాసిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు.