Swasika Rejects Ram Charan's Peddi Movie Offer: రీసెంట్‌గా వచ్చిన నితిన్ 'తమ్ముడు' మూవీలో నెగిటివ్ రోల్‌లో తన నటనతో ఆకట్టుకున్నారు మలయాళ హీరోయిన్ శ్వాసిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో ఆమెకు ఆఫర్ రాగా దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. లేటెస్ట్ మలయాళ మూవీ 'వాసంతి' ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఆఫర్ రిజెక్ట్ చేశా

తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో హీరోయిన్ తల్లిగా నటించి మెప్పించారు శ్వాసిక. ఆ పాత్రలో విపరీతమైన క్రేజ్ రాగా... తనకు వరుసగా అలాంటి ఆఫర్సే వచ్చాయని చెప్పారు. 'లబ్బర్ పందు మూవీలో మదర్ రోల్‌‌కు మంచి పేరు రావడంతో చాలామంది దర్శకులు వరుసగా మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. 33 ఏళ్ల వయసులో ఈ రోల్స్ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. రామ్ చరణ్ 'పెద్ది' మూవీలోనూ హీరో తల్లి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. ఒకవేళ ఆ మూవీలో ఆ రోల్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ప్రస్తుతానికి అలాంటి రోల్స్ చేయాలని నాకు లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఛాన్స్ వస్తే ఆలోచిస్తా.' అంటూ చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా... నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్వాసిక నిర్ణయం కరెక్టే అని చిన్న ఏజ్‌లో మదర్ క్యారెక్టర్స్ సరికాదంటూ అభిప్రాయపడ్డారు. చరణ్ మూవీలోనిది మంచి ఛాన్సే అయినా మదర్ రోల్ కావడంతో ఆఫర్ రిజెక్ట్ చేయడం సరైనదే అంటూ కామెంట్స్ చేశారు. 

Also Read: ఓటీటీలోకి విజయ్ 'కింగ్డమ్' వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా రూపొందుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉండగా... భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.